Diwali 2023 | పండుగ మిఠాయి తినిపిస్తా!
మట్టి ప్రమిదలు. చిట్టి దీపాలు. కాకర పువ్వొత్తులు. మతాబులు. లక్ష్మీ పూజలు. పట్టుచీర రెపరెపలు. వీటికి ఇంకొక్కటి తోడైతేనే ధూమ్‌ధామ్ దీపావళి. అవును.. మిఠాయిలే! నోరు తీపి అయితే.. మాటలూ కమ్మగా ఉంటాయి. నవ్వుల పువ్వులు పూస్తాయి. కాబట్టే, ఆత్మీయులకు పంచే మిఠాయిల విషయంలో సకల జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. ఆ అంచనాకు తగినట్టు మిఠాయి తయారీదారులు పాకశాలను ప్రయోగశాలగా మారుస్తున్నారు
Diwali 2023 | మట్టి ప్రమిదలు. చిట్టి దీపాలు. కాకర పువ్వొత్తులు. మతాబులు. లక్ష్మీ పూజలు. పట్టుచీర రెపరెపలు. వీటికి ఇంకొక్కటి తోడైతేనే ధూమ్‌ధామ్ దీపావళి. అవును.. మిఠాయిలే! నోరు తీపి అయితే.. మాటలూ కమ్మగా ఉంటాయి. నవ్వుల పువ్వులు పూస్తాయి. కాబట్టే, ఆత్మీయులకు పంచే మిఠాయిల విషయంలో సకల జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. ఆ అంచనాకు తగినట్టు మిఠాయి తయారీదారులు పాకశాలను ప్రయోగశాలగా మారుస్తున్నారు. ధర ఎంతైనా ఫర్వాలేదు. మిఠాయ్ మస్తుగుండాలి. పది స్వీట్బాక్సుల మధ్య పదకొండో డబ్బా కాకూడదు. చూడగానే ఆకట్టుకోవాలి. తినగానే ‘వహ్వా’ అనిపించాలి. మరో ముక్క నోట్లో వేసుకోవాలి. ఆ ముక్క ఫోన్ చేసి మరీ మనకు చెప్పాలి. మిఠాయి దుకాణాలకు దీపావళి అతిపెద్ద ఈవెంట్. ఫైనాన్షియల్ ఇయర్లో సగం టార్గెట్ ఈ సీజన్లోనే అయిపోతుంది.
అసలే పోటీ యుగం. పక్క షాపులో పాతిక రకాలిస్తే.. మనం నలభై రకాలు ఇవ్వగలగాలి. సంప్రదాయ మిఠాయిల సెగ్మెంట్ సంప్రదాయ మిఠాయిలదే. అదొక మినిమమ్ గ్యారెంటీ విభాగం. నవతరం కస్టమర్లను ఆకట్టుకోడానికి.. కోవా కజ్జికాయలు, అరిసెలు, సున్నుండలు మాత్రమే సరిపోవు. కొత్త రుచులు కావాలి. కొత్త ప్రయోగాలు చేయాలి. అవసరమైతే పాతకొత్తల్ని మేళవించాలి. ఈ దీపావళికి అదే జరుగుతున్నది. నిజానికి ఏ నోరుతిరగని అరబ్ స్వీట్స్తోనో పోలిస్తే.. భారతీయ రుచులైన బర్ఫీ, గులాబ్‌జామ్, హల్వా మొదలైనవాటితో భావోద్వేగ అనుబంధం ఉంటుంది. వాటినే కాస్తంత కొత్తగా అందిస్తే జనం మురిసిపోతారు. ఎగబడి కొంటారు. అందుకే కొన్ని మిఠాయి దుకాణాలు లడ్డూలపైనే గురిపెడుతున్నాయి.
పసిగుడ్డులుగా ఉన్నప్పటి నుంచీ మనకు బూందీ లడ్డూలు తెలుసు. క్రాన్బెర్రీ లడ్డూలే కొత్త. అందులో కాసింత జిన్ను కలిపి.. కిచెన్ ల్యాబ్‌లో సరికొత్త ప్రయోగం చేస్తున్నారు. ఆమ్ పాపడ్ లడ్డూ కూడా అలాంటి ఆవిష్కరణే. పాప్‌కార్న్ అంటే పిల్లలతోపాటు పెద్దలూ పడిచస్తారు. దీంతో పాప్‌కార్న్ కారమెల్ బర్ఫీలాంటి వాటిని ఎగబడి కొంటున్నారు. కేక్స్ మీద వేసినట్టే.. మిఠాయిల మీద కూడా పేర్లు, పేరులోని తొలి ఆంగ్ల అక్షరాలు ముద్రించి ఇస్తున్నారు. దీపావళి అంటేనే పటాకుల పండుగ కాబట్టి, పటాకుల ఆకారంలో స్వీట్స్ అందిస్తున్నవారూ ఉన్నారు.
అంతేనా..
వీగన్ స్వీట్స్కీ గిరాకీ పెరిగింది. ఆవు, గేదెపాలకు ప్రత్యామ్నాయాలను జోడించి మరీ తయారు చేస్తున్నారు. షుగర్ ఫ్రీ ఆప్షన్ ఉండనే ఉంది. ట్రాన్స్‌ఫ్యాట్ వల్ల గుండెకు ప్రమాదం కాబట్టి, ‘ట్రాన్స్‌ఫ్యాట్ ఫ్రీ’ తీపికే ఓటేస్తున్నది కొత్త తరం. దీంతో మిఠాయివాలాలు ఆ ప్రమాదకర కొవ్వును దూరం పెడుతున్నారు. ‘గ్లూటెన్ ఫ్రీ’ ఆప్షన్ అదనం. ‘అయామ్ ఆన్ డైట్’ తెగ పెరిగిపోయింది కాబట్టి, ఆ మేరకు మిఠాయి సైజును ట్రిమ్ చేస్తున్నారు. ప్యాకింగ్ బ్రహ్మాండంగా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ‘మా మిఠాయిలో తీపి తక్కువ, ప్రేమ ఎక్కువ’ తరహా క్యాప్షన్స్ కూడా జోడిస్తున్నారు.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

