Naya Mall | త్రివర్ణాలు జెండాలోనే కాదు భారతీయుల గుండెల్లోనూ పదిలమే
త్రివర్ణాలు జెండాలోనే కాదు భారతీయుల గుండెల్లోనూ పదిలమే. మువ్వన్నెల పండుగకు ముచ్చటైన కానుకలా జపాన్ వాచీల తయారీ సంస్థ సీకో ప్రత్యేక ఎడిషన్‌ను తీసుకువచ్చింది. వాచీ డయల్ మీద మూడు రంగులు వచ్చేలా రూపొందించిన ఈ కలెక్షన్‌కు ‘మేడ్ ఆఫ్ గ్లోరీ’గా పేరు పెట్టింది.
- మువ్వన్నెల కాలం
Naya Mall | త్రివర్ణాలు జెండాలోనే కాదు భారతీయుల గుండెల్లోనూ పదిలమే. మువ్వన్నెల పండుగకు ముచ్చటైన కానుకలా జపాన్ వాచీల తయారీ సంస్థ సీకో ప్రత్యేక ఎడిషన్‌ను తీసుకువచ్చింది. వాచీ డయల్ మీద మూడు రంగులు వచ్చేలా రూపొందించిన ఈ కలెక్షన్‌కు ‘మేడ్ ఆఫ్ గ్లోరీ’గా పేరు పెట్టింది. సీకో 5 స్పోర్ట్స్ ఆటోమేటిక్ పేరిట ఇండియా లిమిటెడ్ ఎడిషన్‌గా తీసుకువచ్చిన ఇవి ఫ్యాషనబుల్‌గా కనిపించే ఆటోమేటిక్ వాచీలు. నీలం, తెలుపు రంగు డయళ్లతో లోపల తేదీ, రోజు కనిపించేలా వీటిని రూపొందించారు. వాచీ డబ్బా మీద అశోక చక్రాన్ని ముద్రించారు. సీకో స్టోర్లతో పాటు సంస్థ వెబ్సైట్లో లభిస్తుంది. ఖరీదు 32 వేల రూపాయలు.
జుట్టు ఉన్నాక క్లిప్పు కామనే. అది కాస్త వెరైటీగా ఉండాలని కోరుకోవడమూ సహజమే. అలాంటిదే ‘జెన్నిఫర్ బెహర్ వెల్వెట్ హెయిర్ క్లిప్’. రిబ్బన్ ముడి వేసినట్టు కనిపించే ఈ క్లిప్‌ను ఎర్రటి వెల్వెట్ వస్త్రంతో రూపొందించారు. వెనక ఉండే స్టీలు క్లిప్ జడకు పెట్టుకునేందుకు సాయపడుతుంది. ఇక ఇది ఫ్రమ్ న్యూయార్క్ అట.. అందుకే ఈ బో క్లిప్ ధర కూడా అదే స్థాయిలో రూ. 12,479 పలుకుతుంది. చూసేవాళ్లే కాదు, కొనేవారు కూడా బో… అబ్బో… అనాల్సిందే. net-a-porter.comలో వీటిని ఆర్డర్ చేసుకోవచ్చు.
లోకర్స్!
లయన్, టైగర్ల మిక్స్డ్ బ్రీడ్ ‘లైగర్’ అని తెలిసిందే. కానీ క్రాస్బ్రీడ్లు సింహాలూ పులుల్లోనే కాదు బూట్లలోనూ ఉంటాయి. ‘నేను హైబ్రిడ్’ అనుకునే వాళ్లను కాస్త తికమకకు గురిచేస్తాయి. ఇక్కడ కనిపిస్తున్న షూస్ కూడా అలాంటివే. క్రిస్టియన్ లాబొటిన్ పాక్వెబోట్ సంస్థ తయారు చేసిన ఈ బూట్లు లోఫర్స్కు స్నీకర్స్‌కు క్రాస్‌బ్రీడ్. రెండిటి లుక్‌నూ కలగలుపుకొని ఒక విభిన్న ైస్టెల్లో కనిపించడం వీటి ప్రత్యేకత.
క్యాజువల్, ఫార్మల్ వేర్ మీదికి సరి పోయే వీటి ధర రూ.78,617. మనసు పడితే mrporter.com ద్వారా ఆర్డర్ చేయొచ్చు.
బ్లేజర్ సూపర్
ఫ్యాషన్ అంటే డెనిమ్.. డెనిమ్ అంటే ఫ్యాషన్.. అన్నంతగా అందాల ప్రపంచంలో పాతుకుపోయిందీ జీన్స్ వెరైటీ. దీనితో ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉంటారు డిజైనర్లు. రోజు రోజుకూ సరికొత్త మోడళ్లు సృష్టిస్తూనే ఉన్నారు. క్వా సంస్థ అయితే ఫ్యాషన బుల్గా కనిపించే బ్లేజర్‌ను సరికొత్తగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ డెనిమ్ క్రాప్డ్ బ్లేజర్ నిండు నీలం రంగులో పొడవైన చేతులతో ప్యాడెడ్ షోల్డర్తో చూడగానే ట్రెండీగా కనిపిస్తుంది. డెనిమ్ కాలమ్ స్కర్ట్‌కి మంచి జతయ్యే దీన్ని qua.clothing.comలో అమ్ముతున్నారు. ధర రూ.3,495.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | వచ్చే ఏడాది దీపావళికి ‘స్పిరిట్’
Dasara Property Sales | దసరా సందడి నిల్.. అమ్మకాలు, లాంచింగ్ లేక వ్యాపారం దివాళా
Crazy Kalyanam | రివార్డులతోపాటు అవార్డులూ సాధించే సినిమా
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

