నయా మాల్
టెక్నాలజీకి సంబంధించిన ‘నయా మాల్’ వచ్చాయి. వీటిలో గదిలోని గాలిని శుభ్రపరచడం, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, హార్డ్వేర్లను అప్‌గ్రేడ్ చేసేది, మెయిన్ కెమెరాతో సెల్ఫీలు తీసుకునేది, లగేజీ స్థలాన్ని ఆదా చేసే వస్తువులు ఉన్నాయి.
పరిశుభ్రత, ప్రశాంతత ఒకే దగ్గర!
ఆధునిక సాంకేతికత, అందమైన రూపకల్పనతో తయారైన అద్భుతమైన హోమ్ డెస్క్‌టాప్ ఉపకరణం కోసం చూస్తున్నారా? గదిలోని గాలిని శుభ్రపరచడంతో పాటు, మనసుకు ప్రశాంతతనూ అందించాలని కోరుకుంటున్నారా? అయితే, Volcano Mist Aroma Diffuser with Realistic Flame Effectపై ఓ లుక్కేయండి. ఇది కేవలం డిఫ్యూజర్గానే కాకుండా.. ఇంటికి కొత్త అందాన్ని తీసుకొస్తుంది. డెస్క్‌టాప్ హ్యుమిడిఫైయర్గా మారి, గదిలో తేమ శాతాన్ని కాపాడుతుంది. పొడిగాలి వల్ల వచ్చే చర్మ సమస్యలను దూరం చేస్తుంది. దీనిలో కొన్ని చుక్కల సుగంధ తైలాలు వేస్తే.. ఇల్లంతా మంచి సువాసనలతో నిండిపోతుంది. ఒత్తిడిని తగ్గించి మంచి నిద్ర పట్టేలా సహాయపడుతుంది. దీనిని బెడ్రూమ్, లివింగ్ రూమ్, ఆఫీస్ డెస్క్, యోగా స్టూడియో, స్టడీ రూమ్‌లో అలంకరణ వస్తువుగానూ వాడుకోవచ్చు.
– ధర: రూ. 2,400, దొరుకుచోటు: అమెజాన్

Volcano Mist Aroma Diffuser
ఒక్కటి చేరిస్తే చాలు..
మారుతున్న టెక్నాలజీతోపాటు మన వర్క్స్పేస్నూ మార్చేయలేం! రోజుకో కొత్త ఆవిష్కరణ జరుగుతున్న ఈ కాలంలో.. ల్యాపీ, డెస్క్‌టాప్ హార్డ్‌వేర్‌ను చీటికీమాటికీ అప్‌గ్రేడ్ చేయలేం! అందుకు బదులుగా.. CyberAxon D3 13-in-1 USB C Docking Stationఒక్కదాన్ని చేరిస్తే చాలు. ఇది కేవలం కేబుల్స్‌ను అనుసంధానించడమే కాకుండా, పనిలో ఉత్పాదకతను, వేగాన్ని పెంచడంలోనూ సాయపడుతుంది. కంటెంట్ క్రియేటర్లు, ప్రొఫెషనల్స్, టెక్ ప్రియుల కోసం రూపొందించిన శక్తిమంతమైన 13-ఇన్-1 మల్టీఫంక్షనల్ స్ట్రీమ్ కంట్రోల్ హబ్ ఇది. ఈ డాకింగ్ స్టేషన్లో వివిధ అవసరాల కోసం ఏకంగా 13 పోర్ట్స్, 2.4 అంగుళాల ఐపీఎస్ టచ్‌స్క్రీన్ ఉన్నాయి. 3డీ మాడల్స్‌లో కస్టమైజ్ చేసుకోదగిన ‘కీ’స్ ఉంటాయి. యూట్యూబర్లు, లైవ్ స్ట్రీమర్లు, ఆఫీస్ ఉద్యోగులు, ప్రోగ్రామర్లు వేగంగా పని పూర్తి చేయడానికి ఇది దోహదపడుతుంది.
– ధర: రూ. 21,000 దొరుకుచోటు: అమెజాన్

Cyberaxon D3
ప్రయాణ కష్టాలకు చెక్
ప్రయాణికుల లగేజ్ స్థలాన్ని ఆదా చేయడంలో FLEXTAIL- VOLLYC సంస్థలు.. విప్లవాత్మక మార్పును తీసుకొచ్చాయి. దాదాపు లగేజ్‌లోని దుస్తుల పరిమాణాన్ని 85శాతం వరకు కుదించగలిగే VOLLYC X FLEXTAIL EZY SETను తీర్చిదిద్దాయి. ఈ EZY SET వల్ల మామూలు కంటే మూడు రెట్లు ఎక్కువ స్థలం మిగులుతుంది. చిన్న బ్యాగులోనే ఎక్కువ సామాను సర్దుకునే అవకాశం ఉంటుంది. ఈ సెట్లో వివిధ రకాల ప్రయాణ అవసరాలకు సరిపోయేలా వేర్వేరు సైజుల్లో వాక్యూమ్ ప్యాక్ బ్యాగులు లభిస్తాయి. వీటిల్లో చిన్న వస్తువుల నుంచి పెద్ద జాకెట్లు, దుప్పట్ల వరకు అన్నిటినీ సులభంగా సర్దుకోవచ్చు. ఇవి కేవలం స్థలాన్ని ఆదా చేయడమే కాకుండా, అత్యుత్తమ నాణ్యత గల మెటీరియల్‌తో తయారవడం వల్ల దుస్తులను తేమ, ధూళి, దుర్వాసనల నుంచి రక్షిస్తాయి. ప్రయాణాల్లో లగేజ్ మోసే ఇబ్బంది చాలా వరకు తగ్గిస్తాయి. ముఖ్యంగా, విమానప్రయాణికులకు అదనపు లగేజ్ చార్జీలను నివారిస్తాయి. ఇంట్లో సీజనల్ దుస్తులు, దుప్పట్లను భద్రపరచడానికీ పనిచేస్తాయి.
– ధర: రూ. 4,600, దొరుకుచోటు: flextail.com

Flextail Vollyc
ఇక మెయిన్ కెమెరాతోనే సెల్ఫీలు
సాధారణంగా స్మార్ట్ఫోన్లలో వెనుక కెమెరాతోనే అత్యుత్తమ ఫొటోలు వస్తాయి. కానీ, ఆ కెమెరాతో సెల్ఫీలు తీసుకోవడం, వీడియోలు రికార్డ్ చేయడం కష్టం. ఈ సమస్యను పరిష్కరించడానికే OPPO Bubble వచ్చింది. ఇది ఫోన్ వెనుక భాగానికి మ్యాగ్నెటిక్ పద్ధతిలో అతుక్కుని, రియల్-టైమ్ కెమెరా వ్యూఫైండర్లా పనిచేస్తుంది. ఫోన్ వెనుక కెమెరాలో మనం ఎలా కనిపిస్తున్నామో ఈ చిన్న డిస్ప్లే ద్వారా లైవ్‌లో చూడవచ్చు. సోలో షాట్లు, గ్రూప్ ఫొటోలు, వీడియోల రికార్డింగ్‌ను దూరం నుంచే కంట్రోల్ చేయవచ్చు. 1.73 అంగుళాల గుండ్రని AMOLED టచ్‌స్క్రీన్, 4జీబీ బిల్ట్-ఇన్ స్టోరేజ్ కూడా వస్తుంది. బ్లూటూత్ 5.2, వైఫై సపోర్ట్ చేస్తుంది.
– ధర: రూ.7,999, దొరుకుచోటు: oppo.com

Oppo Bubble
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

