తొలకరి జల్లుల్లో…
ఊరూరా సెలయేళ్లు. ఓచోట ముందుకు ఉరికే నదీనదాలు. మరోచోట వెనక్కి మళ్లిన సాగర జలాలు. ఈ వాగుల్లోకి వంగి చూస్తూ పొంగిపోయే కొబ్బరి చెట్లు.. ఇదీ కేరళ సౌందర్యం. ఎన్నెన్నో అందాలు తురుముకున్న పడమటి కనుమలు.. తొలకరి జల్లుల్లో మరింత సౌందర్యాన్ని సంతరించుకుంటాయి.
ఊరూరా సెలయేళ్లు. ఓచోట ముందుకు ఉరికే నదీనదాలు. మరోచోట వెనక్కి మళ్లిన సాగర జలాలు. ఈ వాగుల్లోకి వంగి చూస్తూ పొంగిపోయే కొబ్బరి చెట్లు.. ఇదీ కేరళ సౌందర్యం. ఎన్నెన్నో అందాలు తురుముకున్న పడమటి కనుమలు.. తొలకరి జల్లుల్లో మరింత సౌందర్యాన్ని సంతరించుకుంటాయి. రుతురాగాల వేళ.. కమ్ముకొచ్చే కారుమబ్బులు.. అమాంతంగా కురిసే వానజల్లులు.. వెల్లివిరిసే హరివిల్లులతో మలయాళసీమ మరింత మనోహరంగా దర్శనమిస్తుంది. ఆ సహజ సౌందర్యాన్ని ఆస్వాదించాలనుకుంటే నీటిపై తేలియాడుతున్నట్టుండే అలప్పుజా (అలెప్పీ)కు వెళ్లాల్సిందే. ‘తూర్పు వెనీస్’గా పేరున్న అలెప్పీలో అడుగడుగునా కాలువలే. వాటిలో తేలికపాటి తెప్పలతో మొదలు పెడితే.. రాజభవనాన్ని మరిపించే హౌస్బోట్ల వరకు రకరకాలు కనిపిస్తాయి.
కాలువ గట్లపై ఆకుపచ్చ తివాచీ పరచినట్టు పచ్చగా ఉంటాయి. కొబ్బరిచెట్ల ఆకులు ఈ కాల్వలకు గొడుగు పడుతుంటాయి. సహజ సౌందర్యంతో కనువిందు చేసే అలెప్పీ వానజల్లు గిల్లగానే మరింత మనోహరంగా మారిపోతుంది. అలాంటి వాతావరణంలో సకుటుంబ సమేతంగా హౌస్‌బోట్‌లో విహరిస్తే అంతకన్నా ఆనందం ఏముంటుంది. పడవ ప్రయాణం అటుంచితే.. ఇక్కడ పర్యాటకులను కట్టిపడేసే ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అలెప్పీలో వెంబనాడ్ సరస్సు సౌందర్యం గురించి ఎంత చెప్పిన తక్కువే. ఈ సరస్సులో పతిరమన్నాల్ ద్వీపంలో విహరించకుండా పర్యాటకులు తిరుగు ప్రయాణమవ్వరు.
కాలువలు, సరస్సులే కాదు.. బీచ్‌లతో కూడా అలరిస్తుంది అలెప్పీ! మరాఠీ బీచ్, కృష్ణపురం బీచ్, అలెప్పీ లైట్ హౌస్, ముళ్లక్కల్ దేవీ ఆలయం, అంబలపుజా దేవాలయం ఇవన్నీ సందర్శనీయ స్థలాలే! సికింద్రాబాద్ నుంచి ఎర్నాకులం వరకు రైళ్లో వెళ్లి.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అలెప్పీ (58 కి.మీ) చేరుకోవచ్చు. అలెప్పీ సమీపంలో కొచ్చిలో విమానాశ్రయం ఉంది. హైదరాబాద్ నుంచి కొచ్చీకి విమానంలో వెళ్లి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అలెప్పీ బాటపట్టొచ్చు.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

