మనుషులకే కాదు.. శునకాలూ లోన్లీగా ఫీలవుతాయట.. ఎలా తెలుసుకోవాలంటే..!
ఒంటరితనం మనుషులకేనా? శునకాలనూ కుంగదీస్తున్నది. ఫలితంగా వాటి మానసిక స్థితిలో తేడా వస్తున్నది. చురుకుదనాన్ని కోల్పోతున్నాయి. హింసాత్మకంగా ప్రవర్తిస్తున్నాయి. మునుపటి క్రమశిక్షణను వదిలేస్తున్నాయి. నిజానికి, పెంపుడు కుక్కలు మహా సున్నితమైనవి. సంతోషంగా అనిపించినా, బాధ కలిగినా ఇట్టే వ్యక్తం చేస్తాయి.
ఒంటరితనం మనుషులకేనా? శునకాలనూ కుంగదీస్తున్నది. ఫలితంగా వాటి మానసిక స్థితిలో తేడా వస్తున్నది. చురుకుదనాన్ని కోల్పోతున్నాయి. హింసాత్మకంగా ప్రవర్తిస్తున్నాయి. మునుపటి క్రమశిక్షణను వదిలేస్తున్నాయి. నిజానికి, పెంపుడు కుక్కలు మహా సున్నితమైనవి. సంతోషంగా అనిపించినా, బాధ కలిగినా ఇట్టే వ్యక్తం చేస్తాయి. యజమాని దగ్గరికి తీసుకోకపోయినా ఒత్తిడికి గురవుతాయి. ప్రపంచవ్యాప్తంగా 23 నుంచి 55 శాతం పెంపుడు కుక్కలు ఒంటరితనంతో బాధపడుతున్నట్టు నిపుణులు గుర్తించారు.
వృత్తి ఉద్యోగాలు, వ్యాపార వ్యవహారాలు, కుటుంబ బాధ్యతలు.. ఇలా రకరకాల కారణాలతో యజమానులు తమను నిర్లక్ష్యం చేసినప్పుడు పెంపుడు జంతువులకు ఒంటరి భావన మొదలవుతుంది. వాటి ప్రవర్తనలో ప్రతికూలమైన మార్పులు కనిపిస్తాయి. కుక్కలు ఎక్కువగా మొరుగుతాయి. పిల్లులైతే మ్యావ్ మ్యావ్ అంటూ.. అటూ ఇటూ తిరిగేస్తాయి. వాటి భావోద్వేగాల్లోనూ తేడా వస్తుంది. తలుపులు, గోడలపై గీతలు పడేలా కాళ్లతో గీకుతూ ఉంటాయి. మునుపటి క్రమశిక్షణను పక్కన పెట్టి.. ఇంట్లోనే మూత్ర విసర్జన చేస్తాయి.
ఇంకా..
- ఆహారాన్ని నమిలే పద్ధతుల్లో వ్యత్యాసం కనిపిస్తుంది.
- ప్రవర్తనలో దూకుడుగా ఉంటాయి.
- రోజంతా ఉపవాసం ఉంటాయి.
- వాంతులు, విరేచనాలు అవుతాయి.
- యజమాని బయటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నప్పుడు.. అతని వెంట వెళ్లాలని ఆరాటపడతాయి. అయినా వదిలి వెళ్లిపోతే తీవ్ర ఉద్వేగానికి గురవుతాయి. ఎగశ్వాస తీసుకుంటాయి. జొల్లు కారుస్తాయి.
ఇలా పోగొట్టాలి..
- ఒంటరితనం కారణంగా దిగులుగా ఉన్న పెంపుడు జంతువుల్ని ఆ మానసిక స్థితి నుంచి బయటపడేయాలంటే ఒకటే మార్గం. మొదట వాటిని సువిశాలప్రపంచంలోకి తీసుకువెళ్లాలి.
- ఇతర పెంపుడు జంతువుల మధ్య వదలాలి. అవకాశం ఉంటే, మరో కుక్కను పెంచుకుంటే సరిపోతుంది.
- పెట్స్‌తో ఎక్కువ సమయం గడపాలి. వీలుంటే ఆఫీసు పనివేళలు మార్చుకోవాలి. లేకుంటే ఇంటి పట్టునే ఉండే బంధువుల సాయం తీసుకోవాలి.
- ఇంటి పరిసరాల్లో స్వేచ్ఛగా తిరిగేలా ఏర్పాట్లు చేయాలి.
- అయినా, ప్రవర్తనలో తేడా కనిపించకపోతే.. పశువుల డాక్టర్‌కు చూపించాలి. తగిన వైద్యం చేయించాలి.

మార్పులు.. చేర్పులు
- ఆఫీసుకు వెళ్లే ముందు వాటిని కాస్త ఆడించి, దగ్గరకు తీసుకుని, వీపుపై తడిమి, తలపై నిమిరి ముద్దు చేయాలి.
- ఒంటరిగా ఉండటాన్ని క్రమంగా అలవాటు చేయాలి. రోజూ ఆ సమయం పెంచుకుంటూ పోతే సమస్యలు రావు.
- సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత లేదా ఉదయం లేవగానే బయటికి తీసుకువెళ్లాలి. అవి అలసిపోయేదాకా ఆడించాలి.
- సాధారణంగా పెంపుడు జంతువులు ఐదారు గంటలు మాత్రమే ఒంటరిగా ఉండగలవు. కానీ, మనం అంతకంటే ఎక్కువ సమయం ఆఫీసులో ఉండాల్సి వస్తుంది. కాబట్టి అవకాశం ఉన్నవాళ్లు మధ్యాహ్న భోజన సమయంలో వీలు చూసుకుని.. ఇంటికి వచ్చి పెట్స్‌ను చేరదీయడం ఓ పరిష్కారం.
- ఆహారం, వ్యాయామం విషయంలో సమయాన్ని కచ్చితంగా పాటించాలి.
- పెంపుడు ప్రాణులను చేరదీసేందుకు ఒక్కో జంతువును ఒక విధంగా నిమరాలి. దాని ఇష్టాన్ని గుర్తించడం ముఖ్యం.
- సంగీతం పెట్స్ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. తరచూ వాటికి మ్యూజిక్ వినిపించవచ్చు.
ఫ్రెండ్లీ హోమ్!
పెంపుడు జంతువులను ఒంటరిగా వదిలి వెళ్లే ముందు ఇంటినిపెట్ ఫ్రెండ్లీగా మార్చాలి. అవి కిచెన్ వైపు వెళ్లకుండా జాగ్రత్త పడాలి. పదునైన వస్తువులను దూరంగా ఉంచాలి. కత్తులు, బ్లేడ్లు, మేకులు మొదలైనవాటిని ఎత్తయిన ప్రదేశంలో భద్రంగా ఉంచాలి. చిన్న చిన్న వస్తువులను కుక్క ఉండే గదిలో ఉంచకూడదు. చార్జింగ్, ఎలక్ట్రిక్ డివైజెస్ కేబుల్స్ తీసేయాలి. కుక్క పిల్లల్లో మెదడు అభివృద్ధి పూర్తి స్థాయిలో జరగదు. ఒంటరిగా ఉంచినప్పుడు కుక్కలు ఎక్కువ సమయం మూత్రాన్ని ఆపుకోలేవు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. అవసరమైనంత ఆహారం దగ్గరలో పెట్టి పోవాలి. ఆహారాన్ని గుర్తించడం, తినడం విషయంలో వాటికి ముందుగానే శిక్షణ ఇప్పించాలి.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

