హైదరాబాదీ అందగత్తె.. ప్రజ్ఞా అయ్యగారి. ఆ చారెడు కళ్ల అమ్మాయి గత ఏడాది లివా మిస్ దివా సూపర్ నేషనల్-2022 టైటిల్ గెలుచుకుంది. ఇప్పుడు, సూపర్ నేషనల్-2023 పోటీలకూ సై అంటున్నది.
త్వరలోనే, పోలండ్ వేదికగా.. అరవై ఏడు దేశాల సుందరాంగులతో పోటీపడనున్నది. ‘మిస్ సూపర్ నేషనల్’ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరూ ఓటేయవచ్చు. మన పిల్ల బంగారమని ప్రపంచానికి చాటిచెప్పొచ్చు.