ZIM vs NED : వన్డే క్రికెట్లో మరో సంచలనం నమోదయ్యేది. జింబాబ్వే(Zimbabwe) జట్టు పసికూన నెదర్లాండ్స్(Netherlands) చేతిలో వన్డే సిరీస్ కోల్పోయేది. కానీ, ఆఖరి బంతికి విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. హరారే స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో ఆతిథ్య జింబాబ్వే ఒక్క పరుగు తేడాతో నెదర్లాండ్స్‌పై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 271 పరుగులకు ఆలౌట్ అయింది.
సియాన్ విలియమ్స్(77), క్లైవ్ మండనే (52) అర్ధ శతకాలతో రాణించారు. 272 లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ ధీటుగా ఆడింది. మ్యాక్స్ డొవ్డ్ (81), టామ్ కూపర్ (74) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. కానీ, ఆఖర్లో జింబాబ్వే బౌలర్లు చెలరేగడంతో 270 రన్స్‌కు ఆలౌటయ్యింది.
ఆఖరి ఓవర్లో నెదర్లాండ్స్ విజయానికి 19 రన్స్ కావాలి. చటరా వేసిన తొలి బంతికే రియాన్ క్లెన్ ఫోర్ కొట్టాడు. ఆ తర్వాత బంతికి రెండు పరుగులు వచ్చాయి. మూడో బంతికి ఒకే రన్. ఐదో బంతకి క్లాసెన్ సిక్స్ కొట్టాడు. అయితే.. ఆఖరి బంతికి నాలుగు పరుగులు అవసరం. కానీ, రియాన్ రనౌట్ కావడంతో జింబాబ్వే ఒక్క రన్ తేడాతో గెలిచింది. దాంతో, మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. సిరీస్ డిసైడర్ అయిన మూడో వన్డే మార్చి 25న హరారేలో జరగనుంది.