జాగ్రెబ్ (క్రొయేషియా): గ్రాండ్ చెస్ టూర్లో భాగంగా జాగ్రెబ్ అంచెలో వరల్డ్ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ ర్యాపిడ్ విభాగంలో ఆరు రౌండ్లు ముగిసేసరికి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. గురువారం జరిగిన ఆరో రౌండ్ గేమ్‌లో తెల్లపావులతో ఆడిన గుకేశ్.. నెదర్లాండ్స్ ఆటగాడు అనీష్ గిరిని ఓడించి 7 పాయింట్లతో సెకండ్ ప్లేస్‌కు చేరుకున్నాడు. అలీరెజా (ఫ్రాన్స్) పది పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. 6 పాయింట్లతో ప్రజ్ఞానంద మూడో స్థానంలో నిలిచాడు.