Australian Open | ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనం.. 93వ ర్యాంకర్ ధాటికి చేతులెత్తేసిన వింబుల్డన్ విజేత
Australian Open : కొత్త ఏడాదిలో జరుగుతున్న తొలి గ్రాండ్ స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్(Australian Open)లో సంచలనం నమోదైంది. నిరుడు వింబుల్డన్ చాంపియన్ మార్కెటా ఒండ్రుసోవా(Marketa Vondrousova) తొలి రౌండ్లోనే...
Australian Open : కొత్త ఏడాదిలో జరుగుతున్న తొలి గ్రాండ్ స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్(Australian Open)లో సంచలనం నమోదైంది. నిరుడు వింబుల్డన్ చాంపియన్ మార్కెటా ఒండ్రుసోవా(Marketa Vondrousova) తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. ఈసారి ఫేవరేట్లలో ఒకరైన ఒండ్రుసోవా సోమవారం జరిగిన పోరులో 93వ ర్యాంకర్ డయానా యస్త్రెమ్స్కా(Dayana Yastremska) చేతిలో చిత్తుగా ఓడిపోయింది.
వరుస సెట్లలో ఆధిపత్యం చెలాయించిన ఉక్రెయిన్ క్వాలిఫయర్ డయానా 6-1, 6-2తో వింబుల్డన్ విజేతను మట్టికరిపించింది. దాంతో, డయానా టాప్ -10 క్రీడాకారిణులపై నాలుగో విజయం నమోదు చేసింది. అయితే.. గ్రాండ్ స్లామ్ టోర్నీలో ఆమెకు ఇదే తొలి గెలుపు కావడం విశేషం.
ఒండ్రుసోవా, డయానా మ్యాచ్ హైలెట్స్
నిరుడు వింబుల్డన్‌లో అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన ఒండ్రుసోవా ఏకంగా ట్రోఫీని కొల్లగొట్టింది.టైటిల్ పోరులో ఆమె ఆరో సీడ్ ఓన్స్ జబేర్(Ons Jabeur)పై అద్భుత విజయం సాధించింది. దాంతో, వింబుల్డన్ టైటిల్ సాధించిన తొలి అన్‌సీడెడ్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ట్రోఫీతో పాటు రూ. 25 కోట్ల ప్రైజ్‌మనీ గెలుచుకుంది.
It’s a STUNNER Down Under!
Qualifier @D_Yastremska upsets No. 7 seed Vondrousova 6-1 6-2.#AusOpen • #AO2024@wwos • @espn • @eurosport • @wowowtennis pic.twitter.com/NPtbPbjmYy
— #AusOpen (@AustralianOpen) January 15, 2024
అయితే.. భారీ అంచనాలతో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో బరిలోకి దిగిన ఒండ్రుసోవా ఊహించని విధంగా తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. వారం క్రితం ఒండ్రుసోవా తొడ కండరాల గాయంతో ఆడిలైడ్ ఇంటర్నేషనల్ టోర్నీ నుంచి మధ్యలోనే వైదొలిగింది. దాంతో, ఆమె ఫిట్‌నెస్‌పై సందేహాలు మొదలయ్యాయి. అనుకున్నట్టుగానే ఈ చెక్ రిపబ్లిక్ ప్లేయర్ కోర్టులో వేగంగా కదలలేకపోయింది. తొలి సర్వీస్ కోల్పోయిన ఒండ్రుసోవా తనకంటే చాలా తక్కువ ర్యాంకర్ డయానాకు పోటీ ఇవ్వలేకపోయింది.
ఇవి కూడా చదవండి
- Inavolu Mallanna | ఐనవోలు మల్లన్న జాతరకు పోటెత్తిన జనాలు
- Artificial intelligence | అభివృద్ధి చెందిన దేశాల్లో 60 శాతం ఉద్యోగాలపై AI ఎఫెక్ట్: IMF చీఫ్ క్రిస్టలినా
- Krithi Shetty | బ్లూ కలర్ శారీలో కవ్విస్తున్న కృతి శెట్టి..
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఎన్నికల వేళ చంద్రబాబు సర్కారు దుర్మార్గాలు చేస్తోంది : పేర్ని నాని
కూలీలు ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలి: జడ్పీ సీఈవో నాగలక్ష్మి
‘టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి’
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

