WestIndies- India 3rd T-20 | 107 పరుగుల వద్ద వెస్టిండీస్ సారధి పూరన్ ఔట్
WestIndies- India 3rd T-20 | భువనేశ్వర్ బౌలింగ్‌లో వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్.. రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.
WestIndies- India 3rd T-20 | టీం ఇండియా-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మూడో టీ-20 మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్న వెస్టిండీస్ 15 ఓవర్లో భువనేశ్వర్ వేసిన నాలుగో బంతిని ఆడబోయిన వెస్టిండీస్ సారధి నికోలస్ పూరన్ నేరుగా రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో వెస్టిండీస్ రెండో వికెట్ కోల్పోయింది. అప్పటి వరకు వెస్టిండీస్ స్కోర్ 109 పరుగులు. అంతకుముందు 15వ ఓవర్ తొలి బంతిని పూరన్ సిక్సర్‌గా మలచడంతో వెస్టిండీస్ స్కోర్ 105 పరుగులకు చేరింది. ఓపెనర్ బ్రాండన్ కింగ్ క్లీన్ బౌల్డ్‌తో క్రీజ్‌లోకి వచ్చిన వెస్టిండీస్ సారధి నికోలస్ పూరన్.. నిలకడగా.. మరో ఓపెనర్ క్లే మేయర్స్‌కు సపోర్ట్ చేస్తున్నాడు. ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో 14వ ఓవర్లో క్లే మేయర్స్ మూడు ఫోర్లు బాదాడు.
అంతకుముందు 10 ఓవర్లు ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 65 పరుగులు చేసింది. టీం ఇండియాబౌలర్లను ధాటిగా ఎదుర్కొంటున్న వెస్టిండీస్ ఓపెనర్లు బ్రాండన్ కింగ్, క్లేమేయర్స్ జోడీని హార్దిక్ పాండ్యా విడదీశాడు. హార్దిక్ పాండ్యా 7.2 ఓవర్లో బ్రాండన్ కింగ్.. క్లీన్ బౌల్డయి పెవిలియన్ బాట పట్టాడు. అప్పటి వరకు వెస్టిండీస్ 57 పరుగులు చేసింది. దీంతో కెప్టెన్ నికోలస్ పూరన్ క్రీజ్‌లోకి వచ్చి రెండు పరుగులు చేశాడు. మరో ఓపెనర్ క్లే మేయర్స్ 38 పరుగులు చేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- 3rd T-20
- Team india
- Westindies
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

