ఆర్యవీర్ అదుర్స్
అండర్-19 ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో యువ భారత జట్టు శుభారంభం చేసింది.
- యువ భారత్ శుభారంభం
ఒమన్: అండర్-19 ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో యువ భారత జట్టు శుభారంభం చేసింది. శుక్రవారం తమ తొలి మ్యాచ్‌లో భారత్.. 10 వికెట్ల తేడాతో నేపాల్‌ను చిత్తుగా ఓడించింది. టాస్ గెలిచి మొదట ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించిన భారత్.. నేపాల్‌ను 128 రన్స్‌కే కట్టడి చేసింది. పేసర్ ఇషాన్ సూద్ (3/18) కొత్త బంతితో నిప్పులు చెరగడంతో నేపాల్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఇషాన్‌కు తోడుగా హైదరాబాదీ బౌలర్ యశ్వీర్ గౌడ్ (2/25) రెండు వికెట్లు తీయగా అర్జున్ రాజ్‌పుత్ (3/8) లోయరార్డర్ పనిపట్టాడు. ఛేదనలో వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ (52 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 70 నాటౌట్), కెప్టెన్ లక్ష్య రాయ్‌చందని (53 నాటౌట్) అజేయ అర్ధశతకాలు బాదడంతో భారత్ 19.1 ఓవర్లకే లక్ష్యాన్ని ఊదేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

