బెంగుళూరు: ఈ యేటి ఐపీఎల్ కోసం డిఫెండింగ్ చాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు(RCB) జట్టు జోరుగా ప్రిపేరవుతున్నది. అయితే ప్రాక్టీస్ సెషన్లో ఓ ఘటన చోటుచేసుకున్నది. ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. యార్కర్ బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అసలు ఏమాత్రం ఆ బంతిని అతను ఆడలేకపోయాడు. ఆ జట్టులో ఉన్న సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఆ బాల్ వేశాడు. లెగ్ స్టంప్‌పై 36 ఏళ్ల భువనేశ్వర్ వేసిన బంతిని కోహ్లీ ఏమాత్రం ఆడలేకపోయాడు. పిన్ పాయింట్ యార్కర్‌తో కోహ్లీ లెగ్ స్టంప్‌ను లేపేశాడు. బ్యాటర్ కోహ్లీ ఆ బంతిని ఆడలేక బ్యాలెన్స్ తప్పిపోయాడు. ఈ ఘటనకు చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
ఆర్సీబీకి ఈసారి ఆరంభంలో కష్టాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆసీస్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ స్టార్టింగ్‌లో కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఇక లెఫ్టార్మ్ సీమ్ బౌలర్ యశ్ దయాల్ కూడా అందుబాటులో ఉండేది అనుమానంగానే ఉన్నది. దీంతో ఆర్సీబీ బౌలింగ్ బాధ్యతలన్నీ భువనేశ్వర్ మీదే పడనున్నాయి. గత ఏడాది ఆర్సీబీ టైటిల్ గెలవడంలో కోహ్లీ, భువనేశ్వర్ కీలక పాత్ర పోషించారు. కోహ్లీ 15 ఇన్నింగ్స్‌లో 657 రన్స్ చేయగా, భువనేశ్వర్ 14 మ్యాచుల్లో 17 వికెట్లు తీసుకున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్ వేలంలో భువనేశ్వర్‌ను ఆర్సీబీ జట్టు 10.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఈసారి ఆర్సీబీ జట్టులో యువ బౌలర్లు రాసిక్ సలామ్ దార్, మంగేశ్ యాదవ్‌లపై భారం పడనున్నది.
This yorker from Bhuvneshwar Kumar completely beat Virat Kohli.🫡
In the last two years, Bhuvneshwar Kumar’s name has gone a bit down, but maybe in this IPL he will definitely do something special.🙌 pic.twitter.com/L0bF9BsR0Z
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) March 19, 2026