Mohammed Siraj: హైదరాబాద్‌లో సిరాజ్ కొత్త ఇంటికెళ్లిన కోహ్లీ
Mohammed Siraj: జూబ్లీహిల్స్ ఫిల్మ్‌నగర్‌లో క్రికెటర్ సిరాజ్ కొత్త ఇంటిని తీసుకున్నాడు. ఆ ఇంటికి సోమవారం రాత్రి ఆర్సీబీ క్రికెటర్లు వచ్చారు. విరాట్ కోహ్లీతో పాటు ఇతర ప్లేయర్లు సిరాజ్ కొత్త ఇంట్లో సందడి చేశారు.
హైదరాబాద్: మహమ్మద్ సిరాజ్(Mohammed Siraj) ప్రస్తుతం ఐపీఎల్లో బెంగుళూరు జట్టుకు ఆడుతున్న విషయం తెలిసిందే. ఈసారి ఐపీఎల్లో ఆర్సీబీ తరపున అత్యధిక వికెట్లు తీసుకున్న సిరాజ్.. ప్రస్తుతం ఆ టోర్నీలో దూకుడుమీదున్నాడు. గురువారం రోజు ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ జట్టుతో ఆర్సీబీ తలపడనున్నది. అయితే హైదరాబాద్ చేరుకున్న ఆర్సీబీ జట్టు సభ్యులు .. సోమవారం రాత్రి సిరాజ్ కొత్త ఇంట్లో విందుకు వెళ్లారు.
కోహ్లీతో పాటు ఆర్సీబీలోని కొందరు ప్లేయర్లు .. హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్లో ఉన్న సిరాజ్ కొత్త ఇంటికెళ్లారు. కోహ్లీతో పాటు డూప్లెసిస్, వెయిన్ పార్నెల్, కేదార్ జాదవ్‌లు ఆ జాబితాలో ఉన్నారు. ఇటీవల సిరాజ్ కొత్త ఇంటికి చెందిన ఓ వీడియో ఆన్లైన్లో వైరల్ అయ్యింది.
పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఆర్సీబీ అయిదో స్థానంలో ఉంది. ఆ జట్టుకు 12 పాయింట్లు ఉన్నాయి. సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిస్తేనే ఆర్సీబీకి ప్లేఆఫ్ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఐపీఎల్లో ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన సిరాజ్.. 16 వికెట్లు తీసి టాప్ ఫామ్‌లో ఉన్నాడు.
Virat Kohli And RCB team visited Siraj New House Opening In Film Nagar Jubilee Hills , HYD ❤️🔥❤️❤️#ViratKohli #Siraj #RCB #RoyalChallengersBangalore #RCBvsSRH @mufaddal_vohra @CricCrazyJohns @imVkohli pic.twitter.com/8DOzAR56c6
— AnilYadavTarakian (@AnilTarakianNTR) May 15, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Insurance | మృతి చెందిన రైతు కుటుంబానికి రూ.2 లక్షల బీమా సాయం
సీసీఐ కొనుగోలు కేంద్రంలో కానరాని రైతులు
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
RS Praveenkumar | జర్మనీలో ఉద్యోగమని చెప్పి ఓ యువకుడి చేతికి కత్తి ఇచ్చారు.. కాంగ్రెస్ సర్కార్ మరో స్కాంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Cyclone Victims | తుపాను బాధితులకు అండగా ఉండాలని ఏపీ కేబినెట్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!

