IPL 2023: సూర్య ఔటై వెళ్తుంటే.. హత్తుకుని మెచ్చుకున్న కోహ్లీ.. వీడియో
IPL 2023: ముంబై బ్యాటర్ సూర్య కొట్టిన షాట్లకు ఆర్సీబీ ప్లేయర్లు బిత్తరపోయారు. ఇక స్టేడియంలో ఉన్న ప్రేక్షకుల ఆ థ్రిల్లింగ్ ఇన్నింగ్స్‌ను ఎంజాయ్ చేశారు. 35 బంతుల్లో 83 రన్స్ చేసి ఔటై వెళ్తున్న సూర్యను కోహ్లీ మెచ్చుకున్నాడు.
ముంబై: క్రికెట్ అంటే జెంటిల్మెన్ గేమ్ అంటారు. క్రీడాస్పూర్తిని చాటడంలో ఆ గేమ్‌కు ప్రత్యేకత ఉంది. ఐపీఎల్(IPL 2023)లో ఆర్సీబీతో జరిగన మ్యాచ్‌లో సూర్యకుమార్ తన బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. భారీ టార్గెట్‌ను ఈజీగా చేజ్ చేశాడు. కళ్లు చెదిరే షాట్లతో చెలరేగిన సూర్యకుమార్ బ్యాటింగ్ స్టయిల్‌ను దిగ్గజ ప్లేయర్లు మెచ్చుకుంటున్నారు. అయితే ముంబై ప్లేయర్ సూర్యను ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ తనదైన రీతిలో ప్రశంసించాడు.
మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సూర్య 35 బంతుల్లోనే 85 రన్స్ చేసి ముంబై జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. అయితే చివరి క్షణాల్లో సూర్య ఔటై.. పెవిలియన్‌కు వెనుదిరుగుతున్న సమయంలో కోహ్లీ తన వైఖరితో ఆకట్టుకున్నాడు. అద్భుత ఇన్నింగ్స్ ఆడి.. ప్లేయర్స్ స్టాండ్స్ దిశగా వెళ్తున్న సూర్యను కోహ్లీ హత్తకుని మెచ్చుకున్నాడు. సూర్య ఆట తీరుకు ముగ్దుడైన కోహ్లీ అతన్ని ప్రశంసించకుండా ఉండలేకపోయాడు.
Beautiful moment of the day.
Virat Kohli 🤝 Suryakumar Yadav.@sachin_rt @imVkohli @SKY_14 @surya_14kumar @Mr360 #SuryakumarYadav pic.twitter.com/gjPY6gwIur— Vinay Yadav (@Vinay_Yadav_Sp) May 9, 2023
ఈ మ్యాచ్‌లో సూర్య, వదేరా మధ్య 140 రన్స్ భాగస్వామ్యం ఏర్పడింది. నెహల్ వదేరా ఈ మ్యాచ్‌లో 52 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరో 21 బంతులు మిగిలి ఉండగానే.. ముంబై ఇండియన్స్ జట్టు విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నది. సూర్య ఇన్నింగ్స్‌లో ఆరు భారీ సిక్సర్లు ఉన్నాయి. నిజానికి ఈ సీజన్లో బ్యాడ్ స్టార్ట్ ఇచ్చిన అతను.. ఆ తర్వాత తన పవర్ గేమ్‌తో ఆకట్టుకుంటున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీ అరేబియాపై డ్రోన్లు, మిస్సైల్స్ దాడి.. ఆ వీడియోలు షేర్ చేయొద్దంటూ భారతీయులకు వార్నింగ్
Harish Rao | దివ్యాంగుల సంస్థకు రెండేళ్లుగా రూ.16 లక్షల బిల్లులు పెండింగ్.. హరీశ్‌రావు ఆగ్రహం
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
KTR | 2028లో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారు.. తెలంగాణను నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం: కేటీఆర్
MS Dhoni | జెన్-జీకి ఎమ్మెస్ ధోని సూచన.. అలాంటి అలవాట్లతో ఆరోగ్యం పాడవుతుందంటూ ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

