Vijay Shankar | ఐపీఎల్‌కు టాటా చెప్పేసిన ఆల్‌రౌండర్..!
Vijay Shankar : భారత ఆటగాడు విజయ్ శంకర్(Vijay Shankar) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) పంతొమ్మిదో సీజన్ కొనసాగుతుండగానే వీడ్కోలు ప్రకటించాడు.
Vijay Shankar : భారత ఆటగాడు విజయ్ శంకర్ (Vijay Shankar) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) పంతొమ్మిదో సీజన్ కొనసాగుతుండగానే వీడ్కోలు ప్రకటించాడు. ఐపీఎల్‌తో పాటు దేశవాళీ క్రికెట్ (Domestic cricket)కు కూడా అల్విదా చెబుతున్నట్టు విజయ్ తెలిపాడు. శుక్రవారం ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడీ ఆల్‌రౌండర్.
ఐపీఎల్ స్టార్‌గా వెలుగొందిన విజయ్ శంకర్ హఠాత్తుగా వీడ్కోలు ప్రకటించాడు. ఐపీఎల్‌తో పాటు దేశవాళీ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్టు శుక్రవారం అతడు ఇన్‌స్టా వేదికగా వెల్లడించాడు. ఐపీఎల్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నా. కొత్త అవకాశాల్ని అందిపుచ్చుకునేందుకు, మరింత క్రికెట్ ఆడేందుకు ఈ రెండింటికి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాఅని విజయ్ శంకర్ పేర్కొన్నాడు. తన సుదీర్ఘ ఐపీఎల్ కెరీర్లో ప్రాతినిధ్యం వహించిన ఫ్రాంచైజీలకు , భారత జట్టుకు ఆడే అవకాశం కల్పించిన బీసీసీఐకి అతడు ధన్యవాదాలు తెలిపాడు.
— Vijay Shankar (@vijayshankar260) May 22, 2026
‘బీసీసీఐ, భారత క్రికెట్ జట్టుకు ధన్యవాదాలు. ఎన్నో విషయాలు నేర్చుకోవడం, లెక్కలేనన్ని జ్ఞాపకాలు పోగేసుకోడవడంతో పాటు దేశం తరఫున ఆడడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నా. 2019 వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఆడిన 500వ మ్యాచ్‌లో చివరి ఓవర్ వేసి తొలి బంతికే వికెట్ తీయడం నేను జీవితాంతం గుర్తు పెట్టుకుంటా. నా కెరీర్లలో నేను విద్వేషాన్ని, ప్రతికూల పరిస్థితులను చవిచూశాను. అయితే.. వాటిని నేను పట్టించుకోకుండా ముందుకు సాగాను. నేను అలా చేయగలిగినప్పుడు ఎవరికైనా సాధ్యమే. పాజిటివ్‌గా ఆలోచించండి. బాగా కష్టపడండి. జీవతమంటే ఏంటో క్రికెట్ ద్వారానే నేర్చుకున్నా. క్రికెట్టే నా జీవితం’ అని విజయ్ భావోద్వేగంతో కూడిన పోస్ట్ పెట్టాడు.
Vijay Shankar wicket first ball of World Cup 2019 against Pakistan ☠️.
He became first player who took first ball wicket in a world cup. https://t.co/JXADdW7b3V pic.twitter.com/PKfDUelGGc— Tanvi (@Tanvi_23x) May 22, 2026
2013లో అరంగేట్రం
తమిళనాడుకు చెందిన విజయ్ 2012లో రాష్ట్ర జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. పదమూడేళ్లు సొంత జట్టుకు ఆడిన అతడు 2025-26 సీజన్లో త్రిపురకు మారాడు. 2013లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడిగా ఐపీఎల్ అరంగేట్రం చేశాడు విజయ్. 2017లో సన్‌రైజర్స్‌కు.. 2018లో ఢిల్లీ క్యాపిటల్స్ జెర్సీతో.. ఆపై మూడేళ్లు మళ్లీ సన్‌రైజర్స్ తరఫున బరిలోకి దిగాడు. 2022లో గుజరాత్ టైటాన్స్ అరంగేట్రంలోనే ఛాంపియన్‌గా నిలవడంలో విజయ్ కీలక పాత్ర పోషించాడు.
Trying, thriving, and reinventing 💛✨
Vijay Shankar, the new mystery spinner!Watch the full video
🔗 : https://t.co/Ydshq4ijz1 #WhistlePodu #Yellove pic.twitter.com/T7uBdyKTXm— Chennai Super Kings (@ChennaiIPL) June 18, 2025
టీమిండియా ఆటగాడిగా 2018-19 మధ్య కాలంలో 12 వన్డేలు, తొమ్మిది టీ20లు ఆడాడంతే. 2025లో సీఎస్కే గూటికి చేరిన విజయ్ తీవ్రంగా నిరాశపరిచాడు. దాంతో.. పంతొమ్మిదో సీజన్ వేలంలో అతడనిఇ ఎవరూ కొనలేదు. ఈ నేపథ్యంలోనే అతడు ఐపీఎల్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | మెదక్ జిల్లాలో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో మంజీరా నదిలో దూకి తల్లి ఆత్మహత్య
Venu Udugula | తెలంగాణ సంస్కృతిని కేవలం ప్లేట్లలో, గ్లాసుల్లో వెతకకండి: దర్శకుడు వేణు ఉడుగుల!
Chandrababu | ఆర్నబ్ తుఫాన్ కారణంగా జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలి : సీఎం చంద్రబాబు
Jio IPO | స్టాక్ మార్కెట్లలోకి ఘనంగా జియో ప్లాట్‌ఫామ్స్ ఎంట్రీ.. 21.36 శాతం ప్రీమియంతో లిస్టింగ్..!
Trivikram | శ్రీనిధి శెట్టి పాదాలకు త్రివిక్రమ్ నమస్కారం.. ‘ఆదర్శ కుటుంబం’ వేడుకలో అసలేం జరిగింది?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

