Tokyo Olympics: వందన హ్యాట్రిక్ గోల్స్.. భారత్ గెలుపు

టోక్యో: టోక్యో ఒలింపిక్స్ ( Tokyo Olympics ) వుమెన్స్ హాకీ లో .. ఇవాళ జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై 4-3 గోల్స్ తేడాతో భారత జట్టు గెలిచింది. ఓయ్ హాకీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఇండియన్ ప్లేయర్ వందనా కటారియా ( Vandana Katariya ) హ్యాట్రిక్ గోల్స్ చేసింది. ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ కొట్టిన తొలి భారత క్రీడాకారిణిగా వందన రికార్డు క్రియేట్ చేసింది. అయితే గ్రూప్ ఏ లో భారత జట్టు తుది మ్యాచ్‌ను గెలిచినా.. క్వార్టర్స్‌లోకి ప్రవేశించే అవకాశం బ్రిటన్, ఐర్లాండ్ మధ్య జరిగే మ్యాచ్‌పై ఆధారపడి ఉంది. గ్రూప్ ఏలో ఇండియా ఆరు పాయింట్లతో నాలుగవ స్థానంలో నిలిచింది. నెదర్లాండ్స్ 12, జర్మనీ 12, బ్రిటన్ 6 పాయింట్లతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. తొలి అర్థభాగంలో రెండు జట్లు 2-2 గోల్స్‌తో సమంగా నిలిచాయి. అయితే రెండవ అర్థభాగం ఇండియన్ ప్లేయర్లు దూకుడు పెంచారు. మ్యాచ్ 49వ నిమిషంలో వందన కటారియా హ్యాట్రిక్ గోల్ కొట్టింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

