Vaibhav Suryavanshi | భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi )శ్రీలంక -ఎ (Sri Lanka A) జట్టుపై ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ముక్కోణపు వన్డే సిరీస్ (Tri-Nation Series) ఫైనల్ మ్యాచ్‌లో దంబుల్లా వేదికగా జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక ఇండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్ కేవలం 11 బంతుల్లోనే అర్థశతకం (50) పూర్తి చేశాడు. దీంతో వైభవ్ లిస్ట్-ఎ (List-A) క్రికెట్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 4, 4, 4, 6, 6, 6 వరుస బౌండరీలతో లంక బౌలర్లను ఊచకోత కోశాడు.