Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
Vaibhav Sooryavanshi: కివీస్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ఆడనున్నాడు. అయితే అతను మూడవ పొజిషన్లో బ్యాటింగ్‌కు దిగనున్నట్లు కెప్టెన్ అయ్యర్ తెలిపారు. ఓపెనింగ్ జోడీ పాత్రను అభిషేక్, శాంసన్ పోషించనున్నారు.
క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ తుది జట్టులోకి వైభవ్ సూర్యవంశీ(Vaibhav Sooryavanshi)ని తీసుకున్నారు. అయితే అతని బ్యాటింగ్ పొజిషన్లో మార్పు జరగనున్నది. ఇటీవల ఏషియన్ గేమ్స్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్.. ఆ తర్వాత వెస్టిండీస్‌తో సిరీస్ సమయంలో బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇక కివీస్‌తో తొలి టీ20 మ్యాచ్‌లోనూ అతనికి చోటు దక్కలేదు. ఫస్ట్ మ్యాచ్‌లో గాయపడ్డ ఇషాన్ కిషన్ స్థానంలో ఇవాళ సూర్యవంశీకి అవకాశం ఇచ్చారు. అయితే టీమిండియా ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ప్రస్తుతం టాప్ ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే.
ఇటీవల విండీస్‌తో జరిగిన సిరీస్‌లో ఆ జోడీ రాణించింది. కివీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనూ ఆ జంట తొలి వికెట్‌కు 91 రన్స్ జోడించింది. ఈ నేపథ్యంలో బ్యాటింగ్ ఆర్డర్లో మార్పు చేయకూడదన్న ఉద్దేశాన్ని టీమిండియా వ్యక్తం చేసింది. ఇవాళ టాస్ గెలిచిన తర్వాత కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మాట్లాడుతూ.. వైభవ్ సూర్యవంశీ మూడవ స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడని చెప్పాడు. ఇషాన్ కిషన్ బ్యాటింగ్ ఆర్డర్‌ను వైభవ్‌కు కేటాయించేశారు. 15 ఏళ్ల సూర్యవంశీ ఇక కివీస్ గడ్డపై తన ప్రతాపం ఎలా చూపిస్తాడో వేచి చూడాల్సిందే.
రెండో టీ20లో తాజా సమాచారం ప్రకారం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న కివీస్ తన తొలి వికెట్‌ను కోల్పోయింది. అర్షదీప్ బౌలింగ్‌లో సీఫర్ట్ ఔటయ్యాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

