బౌలర్లపైనే బెంగ.. నేడు న్యూజిలాండ్‌తో భారత్ రెండో టీ20
తమ బ్యాట్ పవర్‌తో తొలి మ్యాచ్‌లో రికార్డు టార్గెట్‌ను ఛేజ్ చేసి న్యూజిలాండ్‌పై అద్బుత విజయం అందుకున్న భారత్ రెండో పోరుకు సిద్ధమైంది. శనివారం జరిగే రెండో టీ20లోనూ గెలిచి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ముందంజ వేయాలని చూస్తోంది. అయితే, తొలి పోరులో రికార్డు స్థాయి లక్ష్యాన్ని ఛేదించినప్పటికీ..
- ఓపెనర్‌గా వైభవ్!
- మ.12.30 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో
క్రైస్ట్‌చర్చ్ : తమ బ్యాట్ పవర్‌తో తొలి మ్యాచ్‌లో రికార్డు టార్గెట్‌ను ఛేజ్ చేసి న్యూజిలాండ్‌పై అద్బుత విజయం అందుకున్న భారత్ రెండో పోరుకు సిద్ధమైంది. శనివారం జరిగే రెండో టీ20లోనూ గెలిచి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ముందంజ వేయాలని చూస్తోంది. అయితే, తొలి పోరులో రికార్డు స్థాయి లక్ష్యాన్ని ఛేదించినప్పటికీ.. బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం ఆందోళన కలిగిస్తోంది. నాలుగేండ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన సీనియర్ పేసర్ భువనేశ్వర్ తన లయను అందుకోవాల్సి ఉంది.
పేస్ ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి 4 ఓవర్లలో 40 పరుగులు ఇచ్చి వికెట్లేమీ పడగొట్టలేకపోయాడు. పవర్ ప్లేలో కివీస్ ఓపెనర్లు అలెన్, టిమ్ సిఫర్ట్ చెలరేగిపోవడంతో భారత పేసర్లు ఒత్తిడికి గురయ్యారు. స్పిన్నర్ అక్షర్ కూడా భారీగా పరుగులు సమర్పించుకోవడంతో, కెప్టెన్ శ్రేయస్ బౌలింగ్ ప్రణాళికలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి వస్తోంది. ఇక, తొలి మ్యాచ్‌లో గాయపడిన ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో 15 ఏండ్ల యువ సంచలనం సూర్యవంశీ ఓపెనర్‌గా తుది జట్టులోకి అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఫామ్‌లో ఉన్న శాంసన్ మూడోనంబర్లో, తిలక్ ఐదో స్థానంలో ఆడనున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రతికా వందనం.. మెరిసిన శ్రీచరణి
బౌలర్లపైనే బెంగ.. నేడు న్యూజిలాండ్‌తో భారత్ రెండో టీ20
జర్నలిస్టు శంకర్‌కు 14 రోజుల రిమాండ్.. న్యూస్‌లైన్ ఎండీపై నాన్‌బెయిలబుల్ సెక్షన్ జోడించిన పోలీసులు
ఇందిరమ్మ చీరలకు బిల్లుల గండం.. పెండింగ్‌లో రూ.120 కోట్ల బకాయి
జ్ఞానేశ్ ను ఎవరూ కాపాడలేరు.. వేలాదిమందితో ఢిల్లీలో భారీ నిరసన ప్రదర్శన
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

