Tokyo Olympics: డిఫెండింగ్ చాంపియన్‌ను మట్టికరిపించిన భారత్
డిఫెండింగ్ చాంపియన్| ఒలింపిక్స్ డిఫెండింగ్ చాంపియన్‌ను భారత హాకీ జట్టు మట్టికరిపించింది. టోర్నీ ఫేవరెట్లలో ఒకటైన అర్జెంటీనాపై భారత హాకీ జట్టు జయకేతనం ఎగురవేసింది. గురువారం ఉదయం జరిగిన గ్రూప్-ఏ నాలుగో మ్యాచ్‌లో 3-1తో విజయం సాధించింది.

టోక్యో: ఒలింపిక్స్ డిఫెండింగ్ చాంపియన్‌ను భారత హాకీ జట్టు మట్టికరిపించింది. టోర్నీ ఫేవరెట్లలో ఒకటైన అర్జెంటీనాపై భారత హాకీ జట్టు జయకేతనం ఎగురవేసింది. గురువారం ఉదయం జరిగిన గ్రూప్-ఏ నాలుగో మ్యాచ్‌లో 3-1తో విజయం సాధించింది. మ్యాచ్ తొలి క్వార్టర్ ముగిసేసరికి 0-0తో ఇరుజట్లు ఖాతా తెరవలేదు. అయితే మ్యాచ్ 43వ నిమిషంలో భారత ఆటగాడు కుమార్ వరుణ్ తొలి గోల్ చేసి జట్టును 1-0తో లీడ్‌లో నిలిపాడు. అయితే కొద్ది సేపట్లోనే (మ్యాచ్ 48వ నిమిషంలో) అర్జెంటీనా ఆటగాడు మైకో కసెల్లా తన జట్టుకు తొలి గోల్ అందించాడు. దీంతో ఇరుజట్ల స్కోర్ సమం అయ్యింది. కాగా, మ్యాచ్ 58వ నిమిషంలో ప్రసాద్ వివేక్ సాగర్ రెండో గోల్ చేయడంతో ఇండియన్ టీం లీడ్‌లోకి దూసుకెళ్లింది. ఇక 59వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ సింగ్ మూడో గోల్ చేసి భారత్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. నాలుగో క్వార్టర్‌లోనే భారత్ రెండు పాయింట్లు సాధించడం విశేషం.
గ్రూప్-ఏ మ్యాచ్‌లలో భారత్ ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడింట విజయం సాధించింది. న్యూజిలాండ్, స్పెయిన్, అర్జెంటీనాపై గెలుపొందగా, ఆస్ట్రేలియా ఓటమి చవిచూసింది. గ్రూప్-ఏలో తన ఆఖరి మ్యాచ్ జపాన్‌తో తలపడనుంది. ఇక మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా తర్వాతి స్థానంలో భారత జట్టు (9 పాయింట్లు) ఉన్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

