Tilak Verma | కలిసొచ్చిన చేతి వాటం.. తిలక్ వర్మ మరో యువరాజ్ అయ్యేనా..?
Tilak Verma : పదహారేండ్లకే రంజీ జట్టు(Ranji Team)కు ఎంపికయ్యేంత నైపుణ్యం.. మహామహులతో కూడిన ముంబై ఇండియన్స్(Mumbai Indians) జట్టులో చోటు దక్కించుకోగలిగే ఆటతీరు.. తొలి బంతి నుంచే ప్రత్యర్థిపై విరుచుకుపడ గల నేర్పు.. అవసరమైతే గంటల కొద్ది క్రీజులో పాతుకుపోగల ఓర్పు.. ఇవన్నీ కలగలిపితే హైదరాబాదీ యువ క్రికెటర్ నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ(Namboori Thakur Tilak Verma). ఐపీఎల్లో ముంబై జట్టుకు...
Tilak Verma : పదహారేండ్లకే రంజీ జట్టు(Ranji Team)కు ఎంపికయ్యేంత నైపుణ్యం.. మహామహులతో కూడిన ముంబై ఇండియన్స్(Mumbai Indians) జట్టులో చోటు దక్కించుకోగలిగే ఆటతీరు.. తొలి బంతి నుంచే ప్రత్యర్థిపై విరుచుకుపడ గల నేర్పు.. అవసరమైతే గంటల కొద్ది క్రీజులో పాతుకుపోగల ఓర్పు.. ఇవన్నీ కలగలిపితే హైదరాబాదీ యువ క్రికెటర్ నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ(Namboori Thakur Tilak Verma). ఐపీఎల్లో ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ.. రెండు సీజన్లుగా నిలకడగా రాణిస్తున్న ఈ యువ కెరటానికి భారత సెలెక్టర్ల నుంచి పిలుపు వచ్చింది.
వెస్టిండీస్‌తో జరుగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ప్రకటించిన భారత జట్టులో తిలక్ చోటు దక్కించుకున్నాడు. బ్యాట్‌తో వీరబాదుడు బాదడంతో పాటు.. బంతితోనూ మాయ చేయగల నేర్పు తిలక్ సొంతం. అయితే అతడి ఎంపిక విషయంలో మాత్రం ఓ వాదన బలంగా వినిపిస్తున్నది. ఎడమ చేతి వాటం ఆటగాడు కావడంతోనే తిలక్‌కు భారత జట్టులో అవకాశం దక్కిందనే చర్చ నడుస్తున్నది.
తిలక్ వర్మ

యువీ, రైనా బాటలో..
రెండు ప్రపంచకప్‌ల వీరుడు యువరాజ్ సింగ్(Yuvraj Singh) గతంలో టీమ్ఇండియా మిడిలార్డర్‌కు వెన్నెముకలా నిలిచిన విషయం తెలిసిందే. చేతిలో వికెట్లు ఉన్న సమయంలో వేగంగా ఆడి స్కోర్ మరింత పెంచగల సామర్థ్యంతో పాటు.. టాపార్డర్ విఫలమైతే.. ఇన్నింగ్స్‌ను నడిపించే బాధ్యత భూజానేసుకొని యువరాజ్ ఎన్నో మరపురాని ఇన్నింగ్స్‌లు ఆడాడు. మరో ఆల్‌రౌండర్ సురేశ్ రైనా(Suresh Raina) కూడా మిడిలార్డర్(Middle Order)లో ఇదే పని చేసేవాడు. ఈ ఇద్దరి రిటైర్మెంట్ తర్వాత భారత మిడిలార్డర్లో వారి లాంటి నాణ్యమైన ఆటగాడు కనబడలేదు.
యువరాజ్ సింగ్, సురేశ్ రైనా

అదీ కాక వీరిద్దరూ ఎడమ చేతి వాటం ఆటగాళ్లే. ప్రస్తుతం భారతజట్టులో ఎడమ చేతి వాటం బ్యాటర్ల కొరత కనిపిస్తున్నది. తొలి ఏడు స్థానాల్లో ఒక్క రవీంద్ర జడేజా(Ravindra Jadeja) తప్ప మిగిలిన వాళ్లంతా కుడి చేతి వాటం వాళ్లే కావడంతో.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తిలక్ వర్మను ఎంపిక చేసినట్లు కనిపిస్తున్నది. మూడు ఫార్మాట్లలోనూ భారత్‌కు సుదీర్ఘ కాలం ప్రాతినిధ్యం వహించే సత్తా ఉన్న ఆటగాడని మాజీలతో మన్ననలందుకున్న తిలక్ వర్మ ఈ అవకాశాన్ని ఏమేరకు సద్వినియోగ పర్చుకుంటాడో చూడాలి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

