IPL | ముంబై: రానున్న ఐపీఎల్ సీజన్ కోసం ప్రసార చిత్రాలు అభిమానులను ఆకట్టుకునే రీతిలో రూపుదిద్దుకుంటున్నాయి. ముఖ్యంగా ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకుంటూ లీగ్ డిజిటల్ స్పాన్సర్ జియో సినిమా లఘు చిత్రాలను రూపొందిస్తున్నది. చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి అభిమానుల్లో ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని ప్రసార వీడియోలను సిద్ధం చేశారు. ధోనీ..తాతా మనువడు పాత్రలో ద్విపాత్రాభినయం చేసిన వీడియోను జియో సినిమా వాళ్లు విడుదల చేశారు. డిజిటల్ మీడియాలో ఐపీఎల్ నిరంతరం ప్రసారం అవుతున్న తీరును ప్రస్ఫుటిస్తూ ఈ యాడ్‌కు రూపకల్పన చేశారు. ఈ చిత్రాల్లో ధోనీ తన సహజ సిద్ధ నటనతో ఆకట్టుకున్నారు.