Team India | శ్రీలంకతో టీ-20 సిరీస్‌ను టీం ఇండియా క్లీన్ స్వీప్ చేసింది. ఆదివారం ధర్మశాలలో జరిగిన మూడో టీ-20 మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. కేవలం 14.5 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి 147 పరుగుల విజయ లక్ష్యాన్ని టీం ఇండియా చేధించింది. దీంతో శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకుంది.
టీం ఇండియా బ్యాట్స్మన్లలో శ్రేయాస్ అయ్యర్ 73 పరుగులతో రాణించగా, రవీంద్ర జడేజా 22, సంజూ శామ్సన్ 18, దీపక్ హుడా 17 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో లహీర్ కుమార రెండు వికెట్లు, కరుణ రత్నే, చమీర చెరో వికెట్ తీసుకున్నారు.
తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 5 వికెట్ల నష్టానికి 20 ఓవర్లకు 146 పరుగులు చేసింది. శ్రీలంకను కెప్టెన్ శనక ఆదుకున్నాడు. 38 బంతుల్లో 74 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దినేశ్ 22, చమికా కరుణారత్నే 12 పరుగులు చేశారు. టీం ఇండియా బౌలర్లలో అవేశ్ ఖాన్ 2 వికెట్లు, సిరాజ్, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీశారు.