Tamim Iqbal | ‘సెంట్రల్ కాంట్రాక్ట్’ వద్దు బాబోయ్.. మొర పెట్టుకున్న బంగ్లాదేశ్ మాజీ సారథి
Tamim Iqbal : బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్(Tamim Iqbal) కొన్నాళ్లుగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఆసియా కప్(Asia Cup 2023) ముందు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి యూటర్న్ తీసుకున్న ఈ స్టార్ బ్యాటర్ తాజాగా మరోసారి వార్తల్లో...
Tamim Iqbal : బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్(Tamim Iqbal) కొన్నాళ్లుగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఆసియా కప్(Asia Cup 2023) ముందు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి యూటర్న్ తీసుకున్న ఈ స్టార్ బ్యాటర్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచాడు. తనకు సెంట్రల్ కాంట్రాక్ట్ వద్దని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు మొరపెట్టుకున్నాడు. బీసీబీ అధ్యక్షుడు నజ్మల్ హుసేన్(Nazmul Hassan)కు తమీమ్ తన అభ్యర్థనను తెలియజేశాడు.
తనకు ఇతర ప్రణాళికలు తనకు ఉన్నాయని, అందుకని తనకు సెంట్రల్ కాంట్రాక్ట్‌లో చోటు ఇవ్వొద్దని కోరాడని బంగ్లా బోర్డు ఆదివారం వెల్లడించింది. ‘ఎన్నికల అనంతరం తమీమ్ బీసీబీ అధ్యక్షుడిని కలుస్తాడు. ఆ తర్వాతే అతడి కెరీర్‌పై ఓ నిర్ణయం తీసుకుంటాం’ అని బీసీబీ క్రికెట్ ఆపరేషన్స్ ఛైర్మన్ జలాల్ యూనస్ తెలిపాడు.

ఓపెనర్‌గా బంగ్లా విజయాల్లో కీలక పాత్ర పోషించిన తమీమ్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా పోటీచేస్తున్నవిషయం తెలిసిందే. దాంతో, ఎన్నికల ప్రచారం, సభలు వంటి వాటితో అతడు బిజీగా ఉండే చాన్స్ ఉంది. అందుకని తమీమ్ సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకునేందుకు సిద్ధపడ్డాడు.

ఆసియా కప్ ముందు వన్డే కెప్టెన్సీ వదులుకున్న తమీమ్.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి అందర్నీ షాక్‌కు గురి చేశాడు. ఆశ్చర్యకరంగా మరుసటి రోజే ఈ స్టార్ బ్యాటర్ యూటర్న్ తీసుకున్నాడు. ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina)ను కలిసిన అతను తన అభిప్రాయం మార్చుకున్నాడు. అయితే.. వ్యక్తిగత కారణాలతో అతడు వన్డే వరల్డ్ కప్‌లో మాత్రం ఆడలేదు. తమీమ్ బంగ్లా తరఫున ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆఖరి మ్యాచ్ ఆడాడు.
ఇవి కూడా చదవండి
- Medigadda | 29న మేడిగడ్డకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు
- Crime News | మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తల్లిని చంపిన తనయుడు
- Hardhik Pandya | వామ్మో.. పాండ్యాకు అంత ధరనా!.. ముంబై నిజంగానే 100 కోట్లు ఇచ్చిందా..?
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

