Tagenarine Chanderpaul | తగెనరైన్ చందర్‌పాల్ డబుల్ సెంచరీ.. ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన వెస్టిండీస్
జింబాబ్వేతో బులవాయ స్టేడియంలో జరుగుతున్న మొదటి టెస్టులో వెస్టిండీస్ ఓపెనర్ తగెనరైన్ చందర్‌పాల్ డబుల్ సెంచరీ (207) బాదాడు. దాంతో, వెస్టిండీస్ 447 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
Tagenarine Chanderpaul : జింబాబ్వేతో బులవాయ స్టేడియంలో జరుగుతున్న మొదటి టెస్టులో వెస్టిండీస్ ఓపెనర్ తగెనరైన్ చందర్‌పాల్ డబుల్ సెంచరీ (207) బాదాడు. మరో ఓపెనర్ క్రెగ్ బ్రాత్‌వైట్‌తో కలిసి అతను తొలి వికెట్‌కు రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు. వీళ్లిద్దరూ 336 రన్స్ జోడించారు. చందర్‌పాల్ ఇన్నింగ్స్‌లో 16 బౌండరీలు, 3 సిక్స్‌లు ఉన్నాయి. ఒకవైపు వికెట్లు పడుతున్నా కూడా చందర్‌పాల్ జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతను డబుల్ సెంచరీకి చేరువైన తర్వాత వెస్టిండీస్ 447 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే ఆట ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 114 రన్స్ చేసింది. ఇన్నొసెంట్ కైయా హాఫ్ సెంచరీ(59 నాటౌట్)తో రాణించాడు.
తండ్రికి తగ్గ తనయుడు
తగెనరైన్ చందర్‌పాల్ వెస్టిండీస్ లెజెండరీ క్రికెటర్ శివ్ నారాయణ్ చందర్‌పాల్ కుమారుడు. తండ్రి నుంచి క్రికెట్ పాఠాలు నేర్చుకున్న అతను దేశవాళీలో రాణించి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. వెస్టిండీస్ తరఫున మూడో టెస్టు ఆడుతున్న అతను తొలి డబుల్ సెంచరీ కొట్టాడు. జింబాబ్వేపై డబుల్ సెంచరీతో ఈ యంగ్‌స్టర్ పలు రికార్డులు బ్రేక్ చేశాడు. దాంతో, అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ కొట్టిన తండ్రీ – కొడుకులుగా తగెనరైన్ చందర్‌పాల్, శివ్‌నారాయణ్ చందర్‌పాల్ రికార్డు సాధించారు. అంతేకాదు ఈ మ్యాచ్‌లో అతను తన తండ్రి టాప్ స్కోర్ (203)ను అధిగమించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

