Team India | సూర్య సారథ్యంలో శ్రీలంకకు టీమ్ఇండియా..
శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్‌ల కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) గురువారం రెండు వేర్వేరు జట్లను ఎంపిక చేసింది. ఈ నెల 27నుంచి మొదయ్యే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం సూర్యకుమార్‌యాదవ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
- టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా ఎంపిక
- వన్డేలకు రోహిత్, కోహ్లీ రాక
- వైస్ కెప్టెన్‌గా శుభ్‌మన్‌గిల్
Team India | న్యూఢిల్లీ: శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్‌ల కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) గురువారం రెండు వేర్వేరు జట్లను ఎంపిక చేసింది. ఈ నెల 27నుంచి మొదయ్యే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం సూర్యకుమార్‌యాదవ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇటీవలే వెస్టిండీస్ గడ్డపై టీ20 ప్రపంచకప్ గెలిచి కొత్త చరిత్ర లిఖించిన టీమ్ఇండియాను సూర్య ముందుండి నడిపించనున్నాడు.
స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్‌పాండ్యా జట్టులోకి వచ్చినా..అజిత్ అగర్కార్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ సూర్య వైపే మొగ్గుచూపింది. జింబాబ్వేపై టీ20 సిరీస్ విజయంలో కీలమైన శుభ్‌మన్‌గిల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. డాషింగ్ బ్యాటర్ అభిషేక్‌శర్మకు చుక్కెదురు కాగా రియాన్ పరాగ్ చోటు నిలుపుకున్నాడు. మరోవైపు వన్డేల్లో దిగ్గజ ద్వయం రోహిత్‌శర్మ, విరాట్‌కోహ్లీ బరిలోకి దిగనున్నారు.
ప్రపంచకప్ విజయం తర్వాత కుటుంబసభ్యులతో కలిసి సరదాగా గడుపుతున్న రోహిత్, కోహ్లీ..లంకతో వన్డే సిరీస్ ఆడనున్నారు. తొలుత టోర్నీకి దూరంగా ఉండాలని భావించినా..కొత్త కోచ్ గౌతం గంభీర్ సూచనల మేరకు ఒప్పుకున్నట్లు తెలిసింది. వన్డేలకు కెప్టెన్‌గా రోహిత్, వైస్‌కెప్టెన్‌గా గిల్ బాధ్యతలు పంచుకోనున్నారు. ఇదిలా ఉంటే వన్డేల్లోకి ఢిల్లీ యువ పేసర్ హర్షిత్ రానా తొలిసారి ఎంపికయ్యాడు. టీ20లు, వన్డేల్లో హైదరాబాద్ స్పీడ్‌స్టర్ మహమ్మద్ సిరాజ్ చోటు దక్కించుకున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీ అరేబియాపై డ్రోన్లు, మిస్సైల్స్ దాడి.. ఆ వీడియోలు షేర్ చేయొద్దంటూ భారతీయులకు వార్నింగ్
Harish Rao | దివ్యాంగుల సంస్థకు రెండేళ్లుగా రూ.16 లక్షల బిల్లులు పెండింగ్.. హరీశ్‌రావు ఆగ్రహం
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
KTR | 2028లో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారు.. తెలంగాణను నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం: కేటీఆర్
MS Dhoni | జెన్-జీకి ఎమ్మెస్ ధోని సూచన.. అలాంటి అలవాట్లతో ఆరోగ్యం పాడవుతుందంటూ ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

