Surya Kumar Yadav | దుబాయ్: టీ20 ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ (861) నంబర్‌వన్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో సూర్య తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
గాయం కారణంగా గత మూడు నెలలుగా జాతీయ జట్టుకు దూరమైన సూర్య..ఐపీఎల్లో కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో లేకుండా పోయాడు. ఫిల్ సాల్ట్, రిజ్వాన్, ఆజమ్ వరుసగా రెండు, మూడు, నాలుగు ర్యాంక్‌ల్లో ఉన్నారు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్‌ఖాన్ (645) తిరిగి టాప్-10లోకి దూసుకొచ్చాడు.