SA 20 | క్వాలిఫయర్ 1లో డర్బన్ జట్టుకు షాక్.. ఫైనల్‌కు దూసుకెళ్లిన సన్‌రైజర్స్
SA 20 : దక్షిణాఫ్రికా టీ20 లీగ్ రెండో సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్(Sunrisers Eastern Cape) అదరగొట్టింది. ఆల్‌రౌండ్ షోతో సత్త చాటి వరుసగా రెండోసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. కేప్‌టౌన్‌లో మంగళవారం జరిగిన...
SA 20 : దక్షిణాఫ్రికా టీ20 లీగ్ రెండో సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్(Sunrisers Eastern Cape) అదరగొట్టింది. ఆల్‌రౌండ్ షోతో సత్త చాటి వరుసగా రెండోసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. కేప్‌టౌన్‌లో మంగళవారం జరిగిన క్వాలిఫయర్ 1లో డర్బన్ సూపర్ జెయింట్స్(Durban Super Giants)పై 51 పరుగుల తేడాతో విజయం సాధించింది.
వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో డేవిడ్ మలన్(63) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. పేసర్లు మార్కో జాన్సెన్, ఒట్నియెల్ బార్ట్మన్లు బుల్లెట్ లాంటి బంతులతో డర్బన్ జట్టు ఫైనల్ ఆశలపై నీళ్లు చల్లారు. ఎలిమినేటర్ పోరులో పార్ల్ రాయల్స్, జొబర్గ్ సూపర్ కింగ్స్ బుధవారం తలపడనున్నాయి. ఈ మ్యాచ్ విజేత గురువారం జరుగబోయే క్వాలిఫయర్ 2లో డర్బన్ జట్టును ఢీకొననుంది.
𝙈𝙖𝙜𝙞𝙘 𝙛𝙧𝙤𝙢 𝘽𝙖𝙖𝙧𝙩𝙢𝙖𝙣 𝙖𝙣𝙙 𝙅𝙖𝙣𝙨𝙚𝙣: #Playoffs #SECvDSG#Betway #SA20 #WelcomeToIncredible pic.twitter.com/oDaohepyCp
— Betway SA20 (@SA20_League) February 6, 2024
తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 రన్స్ కొట్టింది. మలన్ 63 45 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్)తో డర్బన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మరో ఎండ్‌లో కెప్టెన్ ఎడెన్ మర్క్రమ్(30) పరుగులతో రాణించాడు.
𝐈𝐬 𝐢𝐭 𝐚 𝐛𝐢𝐫𝐝, 𝐢𝐬 𝐢𝐭 𝐩𝐥𝐚𝐧𝐞.. 𝐧𝐨 𝐢𝐭 𝐢𝐬 𝐒𝐮𝐩𝐞𝐫 𝐀𝐢𝐝𝐞𝐧. 🦸♂️#Betway #SA20 #Playoffs #SECvDSG #WelcomeToIncredible pic.twitter.com/WFz4dZJvPW
— Betway SA20 (@SA20_League) February 6, 2024
అనంతరం భారీ ఛేదనలో డర్బన్ జట్టుకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ టోని డిజార్జి(2), మాథ్యూ బ్రీడ్జ్కే(3)లు 13 పరుగులకే డగౌట్‌కు చేరారు. మిడిలార్డర్లో వియాన్ మల్డర్(38), హెన్రిచ్ క్లాసెన్(23)లు పోరాడినా.. పేసర్లు మార్కో జాన్సెన్, ఒట్నియెల్ బార్ట్‌మన్ చెరో నాలుగు వికెట్లతో డర్బన్ జట్టును కోలుకోలేని దెబ్బ తీశారు. దాంతో, డర్బన్పై సన్‌రైజర్స్ జట్టు 51 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఇవి కూడా చదవండి
- Anand Mahindra | అటల్ సేతుపై జర్నీ వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్ర
- Elephant | బిడ్డ సమాధి వద్ద.. బోరున విలపించిన ఏనుగు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Basar IIIT | బాసర ట్రిపుల్ ఐటీకి నీటి కరువు.. నీటి సమస్యతో తరగతులు బంద్
Cyclone Arnab | ‘అర్ణబ్’తో కోస్తాంధ్రకు వణుకు వాతావరణ శాఖ హైఅలర్ట్
Land Scam | అసైన్డ్ ఖల్లాస్.. 1000 కోట్ల విలువైన లావణి భూముల్లో బిగ్ విల్లాస్!.. మంఖాల్‌లో భూ కైంకర్యం
Horoscope | 26-10-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
ఆ ఆలస్యం నాకిష్టంలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

