Sunil Gavaskar | ‘ప్లీజ్.. ఫిట్‌గా ఉన్నా ఆడొద్దు’.. ధోనీకి గవాస్కర్ అభ్యర్థన..!
Sunil Gavaskar : సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)ను ఓడిస్తే చెన్నై ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగపడే అవకాశముంది. ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) మైదానంలోకి దిగుతాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
Sunil Gavaskar : పంతొమ్మిదో సీజన్లో ప్లే ఆఫ్స్‌పై కన్నేసిన చెన్నై సూపర్ కింగ్స్ (Chennai SuperKings) కీలక మ్యాచ్ ఆడనుంది. సొంతగడ్డపై లీగ్ దశ చివరి మ్యాచ్ ఆడుతున్న సీఎస్కే విజయంతో ముందంజ వేయాలనుకుంటోంది. సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)ను ఓడిస్తే చెన్నై ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగపడే అవకాశముంది. ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) మైదానంలోకి దిగుతాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) మాత్రం ‘ప్లీజ్.. ఫిట్‌గా ఉన్నా ఆడొద్దు’ అని ధోనీకి సలహా ఇస్తున్నాడు.
కాలిపిక్క కండరాల సమస్యతో బాధ పడుతున్న ధోనీ పంతొమ్మిదో సీజన్లో ఒక్క మ్యాచూ ఆడలేదు. సీజన్ ఆరంభానికి ముందే బ్యాటందుకుని ప్రాక్టీస్ చేసిన మహీ భాయ్.. నెట్స్‌లో కనిపిస్తున్నా తుది జట్టులో ఉండడం లేదు. చెపాక్‌లో సోమవారం సీఎస్కే ఆఖరి మ్యాచ్ ఆడుతున్నందున ధోనీ ఆడే అవకాశముందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఈ సందర్భంగా ‘నా చివరి టీ20 మ్యాచ్ చెపాక్‌లోనే ఆడుతాను’అని ధోనీ ఇదివరకూ పేర్కొన్న విషయాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. కానీ, సునీల్ గవాస్కర్ మాత్రం ధోనీని ఆడొద్దని కోరుతున్నాడు.
Sunil Gavaskar questions whether CSK should risk playing MS Dhoni in a must-win encounter against SRH at Chepauk#SunilGavaskar #CSK #IPL2026 #CSKvsSRH #CricketTwitter pic.twitter.com/0gZbynIfQX
— InsideSport (@InsideSportIND) May 18, 2026
స్టార్ స్పోర్ట్స్ ‘క్రికెట్ లైవ్’లో మాట్లాడుతూ.. ‘ప్లే ఆఫ్స్ బెర్తులో చెన్నైకి కీలకమైన మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్‌లో ధోనీని ఆడించడం పెద్ద పొరపాటు అవుతుంది. అతడు తుది జట్టులో ఉంటే నేనైతే ఆశ్చర్యపోతాను. ఎందుకంటే.. అతడు గాయం కారణంగా సీజన్లో ఒక్క మ్యాచ్ ఆడలేదు. ఏడాది పైగా మైదానంలోకి ఆడింది లేదు. కాబట్టి.. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కు ధోనీ ఫిట్‌గా ఉన్నా సరే తీసుకోవద్దు. ఒకవేళ తీసుకుంటే బ్యాటింగ్ ఆర్డర్ దెబ్బతింటుంది’ అని సన్నీ అభిప్రాయపడ్డాడు.

30 -40 నిమిషాలు
ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో కథనం ప్రకారం సన్‌రైజర్స్‌తో మ్యాచ్ కోసం ఆదివారం ధోనీ చెపాక్‌లో 30 -40 నిమిషాలు గట్టిగా సాధన చేశాడు. నెట్స్‌లో మహీ స్పిన్నర్లను ఎదుర్కొన్నాడు. దాంతో.. ఆరెంజ్ ఆర్మీపై తాల ఆడుతాడనే వార్తలు జోరందుకున్నాయి. పంతొమ్మిదో సీజన్ కోసం ధోనీని అన్క్యాప్డ్ ప్లేయర్‌గా రూ.4 కోట్లకు చెన్నై అట్టిపెట్టుకుంది. ఇప్పటివరకూ 278 మ్యాచుల్లో 137.45 స్ట్రయిక్ రేటుతో 5,439 పరుగులు సాధించాడు. ఇందులో 24 అర్ధ శతకాలు ఉండగా.. 84 నాటౌట్.
MS Dhoni was hitting big sixes in net yesterday before the SRH game.
Still believing he’ll play today pic.twitter.com/gaLSuZoabT
— Abhinav MSDian™ (@Abhinav_hariom) May 18, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
Anurag Thakur: ఆరోపణలు చేస్తాడు.. కోర్టులో క్షమాపణలు చెప్తాడు.. ఇదీ రాహుల్ గాంధీ ట్రాక్ రికార్డు
Jobs DRDO | హైదరాబాద్ డీఆర్డీవోలో 195 అప్రెంటిస్ ఖాళీలు.. నవంబర్ 1 చివరితేదీ
Bhagat Singh Photo On Voter List | ఓటర్ల జాబితాలో భగత్ సింగ్ ఫొటో.. విమర్శలపై ఎన్నికల అధికారుల వివరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

