Steve Smith | భారత్‌తో వన్డే సిరీస్‌కు కమిన్స్ దూరం.. స్మిత్‌కు కెప్టెన్సీ
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ (Border - Gavaskar Trophy) ఆఖరి రెండు టెస్టులకు దూరమైన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) వన్డే సిరీస్‌లో కూడా ఆడేది అనుమానమే. దాంతో, అతని స్థానంలో స్టీవ్ స్మిత్ (Steve Smith) జట్టును నడిపించనున్నాడు. ఈ విషయాన్ని ఆ జట్టు ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ ఒక ప్రకటనలో వెల్లడించాడు.
Steve Smith : బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ (Border – Gavaskar Trophy) ఆఖరి రెండు టెస్టులకు దూరమైన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) వన్డే సిరీస్‌లో కూడా ఆడేది అనుమానమే. దాంతో, అతని స్థానంలో స్టీవ్ స్మిత్ (Steve Smith) జట్టును నడిపించనున్నాడు. క్రికెట్ ఆస్ట్రేలియా ఈ సీనియర్ ప్లేయర్‌కు కెప్టెన్సీ అప్పగించింది. ఈ విషయాన్ని ఆ జట్టు ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ ఒక ప్రకటనలో వెల్లడించాడు. ‘వన్డే సిరీస్ కోసం ప్యాట్ కమిన్స్ భారత్ రావడం లేదు. అతను ఇంటి వద్దనే ఉండనున్నాడు. ప్రస్తుతం కష్ట సమయంలో ఉన్న కమిన్స్ కుటుంబానికి మేమంతా అండగా ఉన్నాం’ అని మెక్‌డొనాల్డ్ ఒక ప్రకటనలో తెలిపాడు.
తల్లి అనారోగ్యంతో ఉండడంతో కమిన్స్ రెండో టెస్టు అనంతరం స్వదేశానికి తిరిగి వెళ్లాడు. అయితే.. ఆమె చనిపోవడంతో అతను అక్కడే ఉండిపోయాడు. కమిన్స్ గైర్హాజరీలో స్మిత్ మూడో టెస్టులో ఆసీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. తెలివైన వ్యూహాలతో జట్టును గెలిపించాడు. అయితే.. అహ్మదాబాద్ వేదికగా జరిగిన కీలకమైన నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. దాంతో, తొలి రెండు టెస్టులు నెగ్గిన టీమిండియా 2-1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. భారత జట్టు వరుసగా నాలుగోసారి బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీని దక్కించుకుంది.
వెంటాడుతున్న గాయాలు
భారత పర్యటన మొదలైనప్పటి నుంచి ఆసీస్ ఆటగాళ్లను గాయాలు వెంటాడుతున్నాయి. గాయంతో పేసర్ జోష్ హేజిల్‌వుడ్ టెస్టు సిరీస్ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే., ఈమధ్యే గాయపడిన జై రిచర్డ్సన్ వన్డే సిరీస్‌కు దూరం కానున్నాడు. రిచర్డ్సన్ స్థానంలో నాథన్ ఎల్లిస్‌కు చోటు దక్కింది. స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (Glenn Maxwell), మిచెల్ మార్ష్ (Mitchell Marsh)లు కూడా గాయంతో వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నారు. ఇక మోచేతి గాయంతో చివరి రెండు టెస్టులు ఆడని ఓపెనర్ డేవిడ్ వార్నర్ వన్డేలకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
వన్డే షెడ్యూల్ ఇదే
భారత్, ఆస్ట్రేలియా జట్లు మూడు వన్డేల సిరీస్‌లో తలపడనున్నాయి. మార్చి 17న ముంబైలో తొలి వన్డే ప్రారంభం కానుంది. మార్చి 19న విశాఖపట్నంలో రెండో వన్డే ఉంది. ఆఖరి వన్డే మార్చి 22న చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే ఇరు దేశాల క్రికెట్ బోర్డులు వన్డే సిరీస్ జట్లను ప్రకటించాయి. 2-1తో టెస్టు సిరీస్ గెలిచిన భారత్ వన్డే సిరీస్ కూడా నెగ్గాలనే పట్టుదలతో ఉంది.
ఇవి కూడా చదవండి
Indore Pitch | నాగ్‌పూర్ పిచ్ డీమెరిట్పై ఐసీసీకి అప్పీల్ చేసిన బీసీసీఐ
Harbhajan Singh | అతను సీఎస్కే బలం మాత్రమే కాదు.. ఆ జట్టు గుండెకాయ : భజ్జీ
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

