న్యూయార్క్: అమెరికా వెటరన్ టెన్నిస్ స్టార్ వీనస్ విలియమ్స్‌కు ఆదిలోనే చుక్కెదురైంది. తన కెరీర్లో 24వ సారి యూఎస్ ఓపెన్ బరిలోకి దిగిన వీనస్..బుధవారం జరిగిన తొలి రౌండ్లో 1-6, 1-6తో గ్రీట్ మినెన్(బెల్జియం) చేతిలో అనూహ్య ఓటమి ఎదుర్కొంది.గతం(2000, 01)లో ఇక్కడ రెండు సార్లు ట్రోఫీ గెలిచిన వీనస్ తన వందో పోరును ఓటమితో ముగించింది. మిగతా మ్యాచ్‌ల్లో సబలెంక 6-3, 6-2తో జానెవెస్కాపై, పెగులా 6-2, 6-2తో కామిల్లా జార్జిపై గెలిచి ముందంజ వేశారు.