Shami – Prithvi Shaw | లండన్‌కు షమీ.. మార్చిలో పృథ్వీ షా పునరాగమనం
Shami - Prithvi Shaw : భారత స్టార్ బౌలర్ మహ్మద్ షమీ(Mohammad Shami), యువ ఓపెనర్ పృథ్వీ షా(Prithvi Shaw)ల పునరగామనం మరింత ఆలస్యం కానుంది. వన్డే వరల్డ్ కప్(ODI World Cup 2023) తర్వాత జట్టుకు దూరమైన షమీ ప్రస్తుతం...
Shami – Prithvi Shaw : భారత స్టార్ బౌలర్ మహ్మద్ షమీ(Mohammad Shami), యువ ఓపెనర్ పృథ్వీ షా(Prithvi Shaw)ల పునరగామనం మరింత ఆలస్యం కానుంది. వన్డే వరల్డ్ కప్(ODI World Cup 2023) తర్వాత జట్టుకు దూరమైన షమీ ప్రస్తుతం కాలిమడమ(Ankle)గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఇక నిరుడు ఇంగ్లండ్ గడ్డపై జరిగిన వన్డే కప్‌లో గాయపడిన పృథ్వీ మోకాలి సర్జరీ నుంచి పూర్తిగా కోలుకోలేదు.
సొంతగడ్డపై జరిగిన వన్డే ప్రపంచ కప్‌లో ఇరగదీసిన షమీ అనూహ్యంగా దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమయ్యాడు. కాలిమడమ గాయం నుంచి కోలుకుంటున్నఅతడు ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టుల్లో ఆడడం లేదు. అయితే.. ఈ స్పీడ్‌స్టర్ మెరుగైన చికిత్స కోసం త్వరలోనే లండన్ వెళ్లనున్నాడని సమాచారం.
మహ్మద్ షమీ

షమీ వెంట నేషనల్ క్రికెట్ అకాడమీ(NCA) స్పోర్ట్స్ సైన్స్ హెడ్ నితిన్ పటేల్(Nitin Patel) కూడా వెళ్లే చాన్స్ ఉంది. షమీ, నితిన్‌లు గురువారం ఎన్సీఏలో ప్రాక్టీస్ సెషన్లో కనిపించారు. అయితే.. వీళ్లిద్దరూ లండన్ ఎప్పుడు వెళ్తారు? అనేది తెలియాల్సి ఉంది.
పృథ్వీ షా

ఐపీఎల్ 16వ సీజన్లో విఫలమైన షా.. ఇంగ్లండ్ గడ్డపై పరుగుల వరద పారించాడు. వన్డే కప్‌లో నార్తంప్టన్‌షైర్ జట్టుకు ఆడిన పృథ్వీ మోకాలి గాయంతో భారత్‌కు వచ్చాడు. ముంబైలో లిగమెంట్‌కు సర్జరీ చేయించుకున్నాడు. దాంతో, ఇరానీ ట్రోఫీతో పాటు, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలకు దూరమయ్యాడు. ఈ స్టార్ బ్యాటర్ మార్చిలో రీ ఎంట్రీ ఇచ్చే చాన్స్ ఉంది. కానీ, ముంబై క్రికెట్ అసోసియేషన్ మాత్రం షాను రంజీల్లో ఆడించాలనే పట్టుదలతో ఉంది. దాంతో, అతడు త్వరలోనే ప్రాక్టీస్ మొదలు పెట్టనున్నాడు. ఈ స్టార్ ఓపెనర్ ఐపీఎల్ 17వ సీజన్‌కు అందుబాటులో ఉంటాడా? లేదా? అనేది తెలియనుంది.
ఇవి కూడా చదవండి
- PM Modi: శ్రీరంగం, రామేశ్వరంకు ప్రధాని మోదీ
- Hanuman Movie | రూ.150 కోట్ల క్లబ్లో చేరిన ‘హనుమాన్’
- Worlds largest lock | అయోధ్య చేరుకున్న ప్రపంచంలోనే అతిపెద్ద బాహుబలి తాళం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

