Shakib Ali Hasan | వరల్డ్ కప్ వైఫల్యం.. రాజకీయాల్లోకి బంగ్లాదేశ్ కెప్టెన్..?
Shakib Ali Hasan : వన్డే వరల్డ్ కప్ వైఫల్యంతో బంగ్లాదేశ్ కెప్టెన్ షకిబుల్ హసన్(Shakib Ali Hasan) కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఈ స్టార్ ఆల్‌రౌండర్ బంగ్లా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అవును.. త్వరలో జరుగబోయే 12వ పార్లమెంటరీ ఎన్నికల్లో షకీబ్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. బంగ్లా కెప్టెన్ తన సొంత జిల్లా అయిన...
Shakib Ali Hasan : వన్డే వరల్డ్ కప్ వైఫల్యంతో బంగ్లాదేశ్ కెప్టెన్ షకిబుల్ హసన్(Shakib Ali Hasan) కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఈ స్టార్ ఆల్‌రౌండర్ బంగ్లా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అవును.. త్వరలో జరుగబోయే 12వ పార్లమెంటరీ ఎన్నికల్లో షకీబ్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. బంగ్లా కెప్టెన్ తన సొంత జిల్లా అయిన మగుర-1 నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నాడు. వచ్చే ఏడాది జనవరి 7 నుంచి బంగ్లాదేశ్‌లో ఎంపీ ఎన్నికలు జరుగనున్నాయి.
బంగ్లా ఆటగాళ్లు రాజకీయాల్లోకి రావడం ఇదే కొత్తకాదు. మాజీ కెప్టెన్ ముష్రఫే మొర్తాజా(Mashrafe Mortaza) గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచాడు. అతడు నరేల్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌కు ఎంపికయ్యాడు. అంతేకాదు ప్రస్తుతం బంగ్లా క్రికెట్ బోర్డు అధ్యక్షుడు షఫిఉల్ అలాం చౌదరీ కూడా 2009లో ఎంపీగా సేవలందించాడు.
షకిబుల్ హసన్

ఆసియా కప్ ముందు వన్డే కెప్టెన్‌గా తమీమ్ ఇక్బాల్(Tamim Iqbal) తప్పుకోవడంతో షకీబ్ మరోసారి సారథిగా ఎంపకియ్యాడు. అయితే.. ఆసియాకప్‌లో బంగ్లా సెమీస్ చేరలేకపోయింది. వరల్డ్ కప్‌లోనూ ఆ జట్టు పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది. కెప్టెన్‌గా ఫెయిలైన షకీబ్.. బ్యాటుతో, బంతితోనూ ఆకట్టుకోలేకపోయాడు. 9 వికెట్లు తీసి, 186 పరుగులు చేశాడంతే. అంతేకాదు శ్రీలంకతో జరిగిన లీగ్ మ్యాచులో షకీబ్.. ఎంజెలో మాథ్యూస్ టైమ్డ్ ఔట్(Timed Out)తో వార్తల్లో నిలిచాడు. ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా షకీబ్ ఎడమ చేతి వేలికి గాయమైంది. దాంతో, అతడు ఆస్ట్రేలియాతో చివరి లీగ్ మ్యాచ్‌కు దూరమయ్యాడు.
ఇవి కూడా చదవండి
-
Kantara Chapter 1 | బిగ్ అప్డేట్.. కాంతార చాప్టర్ 1 ఫస్ట్ లుక్ టీజర్ వచ్చేసింది
-
Minister Harish Rao | రైతుబంధు కావాలంటే కాంగ్రెస్ ఖతం కావాలి: మంత్రి హరీశ్ రావు
-
Davis Cup | డేవిస్ కప్ విజేత ఇటలీ.. 47 ఏండ్ల కల సాకారం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

