Shakib Al Hasan | ఎంపీగా గెలుపొందిన బంగ్లాదేశ్ కెప్టెన్.. లక్షా యాభై వేల మెజార్టీ సాధించిన షకీబ్
Shakib Al Hasan : బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబుల్ హసన్(Shakib Al Hasan) ఎంపీగా కొత్త అవతారం ఎత్తనున్నాడు. ఇన్నాళ్లు మైదానంలో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన షకీబ్ ప్రజాజీవితంలో భాగం కానున్నాడు. వన్డే వరల్డ్ కప్ అనంతరం రాజకీయాల్లో అడుగుపెట్టిన అతడు.....
Shakib Al Hasan : బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబుల్ హసన్(Shakib Al Hasan) ఎంపీగా కొత్త అవతారం ఎత్తనున్నాడు. ఇన్నాళ్లు మైదానంలో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన షకీబ్ ప్రజాజీవితంలో భాగం కానున్నాడు. వన్డే వరల్డ్ కప్ అనంతరం రాజకీయాల్లో అడుగుపెట్టిన అతడు.. తొలిసారే సార్వత్రిక ఎన్నికల్లో(General Elections) ఘన విజయం సాధించాడు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో మగుర 1(Magura 1) నియోజకవర్గం నుంచి పోటీ చేసిన షకీబ్ భారీ మెజార్టీతో గెలుపొందాడు.
ప్రధాని షేక్ హసీనా(Sheikhe Hasina)కు చెందిన అవామీ లీగ్(Awami League) తరఫున పోటీ చేసిన ఈ ఆల్‌రౌండర్ ఏకంగా లక్షా యాభై వేల మెజార్టీతో సమీప ప్రత్యర్థి రెజౌల్ హసన్(Rezaul Hasan)ను చిత్తు చేశాడు. షకీబ్‌కు 1,85,388 ఓట్లు రాగా.. బంగ్లాదేశ్ కాంగ్రస్ పార్టీకి చెందిన హసన్‌కు కేవలం 45,933 ఓట్లు మాత్రమే పడ్డాయి. దాంతో, ఎన్నికల్లో గెలిచిన బంగ్లాదేశ్ రెండో కెప్టెన్‌గా ఎంపీగా షకీబ్ రికార్డు సృష్టించాడు. ఇంతకు ముందు ముష్రఫే ముర్తాజా(Musharfe Mortaza) ఎంపీగా ఎన్నికైన విషయం తెలిసిందే.

షకీబ్ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నానని ప్రకటించగానే అతడి క్రికెట్ కెరీర్ ముగిసిందని కొందరు ప్రచారం మొదలెట్టారు. దాంతో, వాళ్లకు చెక్ పెట్టేందుకు అతడు ప్రచార సభల్లో జనాన్ని అడిగాడు. ‘నేను రిటైర్ అవ్వాలా? ‘అని ఎన్నికల ప్రచారంలో ఓటర్లను అడిగిన షకీబ్.. ‘నేను ఇంకా క్రికెట్‌కు వీడ్కోలు పలకలేదు. అలాంటప్పుడు ఈ వదంతులు ఎందుకు సృష్టిస్తున్నారు’ అంటూ ప్రత్యర్థులపై విరుచుకుపడ్డాడు. 19 ఏండ్లకే ప్రీమియర్ స్పోర్ట్స్ అకాడమీలో చేరిన షకీబ్ 2006లో బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా అరంగేట్రం చేశాడు. అనతికాలంలోనే ప్రపంచంలోని ఉత్తమ ఆల్రౌండర్లలో ఒకడిగా ఎదిగాడు. అంతేకాదు మూడు ఫార్మాట్లలో అగ్రస్థానంలో నిలిచిన తొలి ఆల్‌రౌండర్‌గా షకీబ్ గుర్తింపు సాధించాడు.
ఇవి కూడా చదవండి
- Cinema News | సినిమా వాళ్లతో డేటింగ్ చేయాలనే ఆలోచన ఎప్పుడూ రాలేదట..
- Teju Ashwini | గ్లామర్ అందాలతో సెగలు పుట్టిస్తున్న తేజు అశ్విని..
- Bilkis Bano Case | బిల్కిస్ బానో కేసు దోషుల విడుదలపై నేడు ‘సుప్రీం’ తుదితీర్పు..
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

