Cinema News | సినిమా వాళ్లతో డేటింగ్ చేయాలనే ఆలోచన ఎప్పుడూ రాలేదట..
దివంగత అందాల తార శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీకపూర్ చక్కటి ప్రణాళికతో కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటున్నది. ఐదేళ్ల సినీ ప్రయాణంలో వివాదాలకు దూరంగా సౌమ్యురాలిగా పేరు తెచ్చుకుందీ భామ.
Cinema News | దివంగత అందాల తార శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీకపూర్ చక్కటి ప్రణాళికతో కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటున్నది. ఐదేళ్ల సినీ ప్రయాణంలో వివాదాలకు దూరంగా సౌమ్యురాలిగా పేరు తెచ్చుకుందీ భామ. ఎలాంటి దాపరికం లేకుండా మనసులోని భావాల్ని నిర్మొహమాటంగా వ్యక్తపరుస్తుందని ఈ అమ్మడి గురించి తెలిసివారు చెబుతుంటారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమా వాళ్లతో డేటింగ్ గురించి తన అభిప్రాయాల్ని వ్యక్తం చేసింది జాన్వీకపూర్. ఇండస్ట్రీకి చెందిన వారితో డేటింగ్ చేయడం తనకు అస్సలు ఇష్టం లేదని చెప్పింది. ‘సినీరంగంలో పనిచేసేవారు ఎప్పుడూ బిజీగా ఉంటారు.
ఎవరికీ సమయాన్ని కేటాయించలేరు. ఇద్దరూ ఒకే వృత్తిలో ఉంటే డేటింగ్ చేయడం ఇంకా కష్టమైపోతుంది. అందుకే సినిమా వాళ్లతో డేటింగ్ చేయాలనే ఆలోచన ఎప్పుడూ రాలేదు’ అని జాన్వీకపూర్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ భామ మహారాష్ట్ర రాజకీయ కుటుంబానికి చెందిన శిఖర్ పహారియాతో ప్రేమలో ఉందని అంటున్నారు. వీరిద్దరి కుటుంబాలకు ఎప్పటి నుంచో సాన్నిహిత్యం ఉందని, కాలేజీ రోజుల నుంచే వీరి ప్రేమాయణం సాగుతున్నదని టాక్. ఈ జంట కలిసి పలు ప్రైవేట్ కార్యక్రమాలకు హాజరైన ఫొటోలు సోషల్‌మీడియాలో దర్శనమిచ్చాయి. అయితే తన లవ్‌ఎఫైర్ గురించి జాన్వీకపూర్ ఇప్పటిదాకా ఎక్కడా స్పందించలేదు. ప్రస్తుతం ఈ సొగసరి తెలుగులో ఎన్టీఆర్ సరసన ‘దేవర’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

