Wimbledon 2023 | వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ సెమీస్‌లో దూసుకెళ్లిన జొకోవిచ్.. 24వ టైటిల్ అందుకుంటాడా?
సెర్బియా యోధుడు నోవాక్ జొకోవిచ్ ఎదురన్నదే లేకుండా దూసుకెళుతున్నాడు. ప్రత్యర్థి ఎవరైనా గెలుపు లక్ష్యంగా టైటిల్ వైపు అడుగులు వేస్తున్నాడు. అప్రతిహత విజయాలను సొంతం చేసుకుంటూ అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకుంటున్నాడు.
Wimbledon 2023 | సెర్బియా యోధుడు నోవాక్ జొకోవిచ్ ఎదురన్నదే లేకుండా దూసుకెళుతున్నాడు. ప్రత్యర్థి ఎవరైనా గెలుపు లక్ష్యంగా టైటిల్ వైపు అడుగులు వేస్తున్నాడు. అప్రతిహత విజయాలను సొంతం చేసుకుంటూ అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకుంటున్నాడు. రుబ్లెవ్‌పై అద్భుత విజయంతో కెరీర్లో 46వ సారి గ్రాండ్‌స్లామ్ సెమీస్ చేరి రోజర్ ఫెదరర్ రికార్డును సమం చేశాడు. మహిళల సింగిల్స్‌లో స్వితోలినా, సబలెంకా సెమీస్ పోరుకు సిద్ధమయ్యారు.
లండన్: ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెర్బియా సూపర్ స్టార్ నోవాక్ జొకోవిచ్ సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. తద్వారా వరుసగా ఐదో టైటిల్‌ను దక్కించుకునేందుకు మరింత చేరువయ్యాడు. ఈ క్రమంలో రోజర్ ఫెదరర్ గ్రాండ్‌స్లామ్ సెమీస్ రికార్డును సమం చేయడంతోపాటు 24 టైటిల్‌ను ముద్దాడేందుకు మరో అడుగు ముందుకేశాడు. మంగళవారం అర్ధరాత్రి జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్ పోరులో జొకోవిచ్ 4-6, 6-1, 6-4, 6-3తో ఏడోసీడ్ ఆండ్రీ రుబ్లెవ్(రష్యా)పై అద్భుత విజయం సాధించాడు. దీంతో ఆల్ ఇంగ్లండ్ క్లబ్లో వరుసగా 33వ విజయంతో దూసుకెళుతున్న జొకో..సెమీస్‌లో జాక్ సిన్నర్‌తో తలపడనున్నాడు.
తొలి సెట్ చేజార్చుకున్నా:
టైటిల్ వేటలో టాప్‌గేర్‌లో దూసుకెళుతున్న జొకోవిచ్..రుబ్లెవ్తో క్వార్టర్స్‌లో పోరులో తొలి సెట్‌ను చేజార్చుకున్నాడు. అయితే రెండో సెట్ నుంచి విశ్వరూపం ప్రదర్శించిన ఈ సెర్బియన్ మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. అద్భుతమైన రిటర్న్స్‌తో పాటు పదునైన సర్వ్‌లతో రుబ్లెవ్కు జొకో చుక్కలు చూపించాడు. రెండో సెట్లో ఏడు బ్రేక్ పాయింట్లను కాపాడుకున్న జొకోవిచ్ అలవోకగా రుబ్లెవ్కు చెక్ పెట్టాడు. సెట్ సెట్‌కు తన ఆటతీరుకు మరింత పదునుపెట్టిన జొకో తన గెలుపు రికార్డును 8-0కు పెంచుకున్నాడు. మ్యాచ్ మొత్తంలో జొకో ఐదు ఏస్‌లే కొట్టినా..42 విన్నర్స్‌ను ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు రుబ్లేవ్ 32 విన్నర్స్, 25 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకునన్నాడు.
రిబకినా నిష్క్రమణ:
మహిళల సింగిల్స్‌లో మూడో సీడ్ ఎలీనా రిబకినాకు అనుకోని షాక్ తగిలింది. బుధవారం జరిగిన క్వార్టర్స్‌లో అన్స్ జాబెర్(ట్యూనీషియా) 6-7(5), 6-4, 6-1తో రిబకినా(కజకిస్థాన్)పై విజయం సాధించింది. దాదాపు రెండు గంటల పాటు జరిగిన పోరులో బ్రేక్ పాయింట్లను నిలబెట్టుకోవడంలో రిబకినా విఫలమైంది. తొమ్మిది అవకాశాల్లో రెండు మాత్రమే సద్వినియోగం చేసుకుంది. ఇక జాబెర్ 8 ఏస్‌లు, 35 విన్నర్లను సొంతం చేసుకుంది. మరో క్వార్టర్స్‌లో రెండో సీడ్ సబలెంకా 6-2, 6-4తో మాడిసన్ కీస్పై గెలిచి వరుసగా రెండో ఏడాది సెమీస్‌లోకి ప్రవేశించింది. ఈ పోరుకు బ్రిటన్ క్వీన్ కామిల్లా హాజరయ్యారు.
డబుల్స్ సెమీస్‌లో బోపన్న జోడీ: పురుషుల డబుల్స్‌లో రోహన్ బోపన్న, ఎబ్డెన్ జోడీ 6-7(7), 7-5, 6-2తో గ్రీక్స్పూర్, స్టీవెన్స్ ద్వయంపై గెలిచి సెమీస్‌లోకి ప్రవేశించింది. తొలి సెట్ చేజార్చుకున్నా..వరుసగా రెండు సెట్లను కైవసం చేసుకుని బోపన్న జోడీ టైటిల్‌కు మరింత చేరువైంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

