దుబాయ్: టీమిండియాపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి విజయం సాధించిన న్యూజిల్యాండ్ జట్టు పసికూన స్కాట్లాండ్తో పోరుకు సిద్ధమైంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో స్కాట్లాండ్ సారధి కైల్ కోట్జర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తాను టాస్ గెలిచుంటే తను కూడా ఫీల్డింగే ఎంచుకునే వాడినని కేన్ విలియమ్సన్ చెప్పాడు. భారత్తో ఆడిన జట్టునే న్యూజిల్యాండ్ కొనసాగిస్తుండగా, స్కాట్లాండ్ జట్టులో గాయం కారణంగా జోష్ డేవీ తప్పుకున్నాడు. అతని స్థానంలో అల్సాదైర్ ఇవాన్స్ ఆడనున్నాడు. న్యూజిల్యాండ్ జట్టు తమ సాధారణ నల్ల జెర్సీతో కాకుండా, నీలిరంగు డ్రెస్లో బరిలో దిగింది.
న్యూజిల్యాండ్: మార్టిన్ గప్తిల్, డారియల్ మిచెల్, కేన్ విలియమ్సన్, డెవాన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్, జిమ్మీ నీషమ్, మిచెల్ శాంట్నర్, ఆడమ్ మిల్నె, టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్, ఇష్ సోధి.
స్కాట్లాండ్: కైల్ కోట్జర్, జార్జ్ మున్సే, మాథ్యూ క్రాస్, రిచీ బెర్రింగ్టన్, కాలమ్ మెక్లాయిడ్, మైఖేల్ లీస్క్, క్రిస్ గ్రీవ్స్, మార్క్ వ్యాట్, సఫ్యాన్ షరీఫ్, అల్సాదైర్ ఇవాన్స్, బ్రాడ్ వీల్