దుబాయ్: పసికూన స్కాట్లాండ్ సత్తా చాటుతోంది. పటిష్టమైన న్యూజిల్యాండ్‌తో నువ్వా నేనా అన్నట్లు తలబడుతోంది. ఫామ్‌లో ఉన్న కివీస్ ఓపెనర్ డారియల్ మిచెల్ (13)ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంతోపాటు కెప్టెన్ కేన్ విలియమ్సన్ (0)ను డకౌట్ చేసిన సఫ్యాన్ షంసీ.. స్కాట్లాండ్కు శుభారంభం అందించాడు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న తన కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టాడు. ఆ తర్వాత కాసేపటికే వికెట్ కీపర్ డెవాన్ కాన్వే (1) కూడా అనవసర షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు. వ్యాట్ వేసిన బంతిని రివర్స్ స్వీప్ చేయబోయిన అతను వికెట్ కీపర్ క్రాస్‌కు చిక్కాడు.
అయితే ఒక పక్క వికెట్లు పడుతున్నా సీనియర్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (39 నాటౌట్) నిలకడగా ఆడుతున్నాడు. ప్రస్తుతం అతనికి తోడుగా గ్లెన్ ఫిలిప్స్ (6 నాటౌట్) క్రీజులో ఉన్నాడు. పది ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయిన న్యూజిల్యాండ్ జట్టు 70 పరుగులు చేసింది.