SCO vs NZ | పోరాడుతున్న స్కాట్లాండ్ బ్యాట్స్‌మెన్.. 10 ఓవర్లకు స్కోరు ఎంతంటే
SCO vs NZ | పటిష్టమైన న్యూజిల్యాండ్‌తో మ్యాచ్‌లో స్కాట్లాండ్ బ్యాట్స్‌మెన్ రెచ్చిపోయి ఆడుతున్నారు. 173 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన స్కాట్లాండ్ను బౌల్ట్ ఆదిలోనే దెబ్బకొట్టాడు.

దుబాయ్: పటిష్టమైన న్యూజిల్యాండ్‌తో మ్యాచ్‌లో స్కాట్లాండ్ బ్యాట్స్‌మెన్ పోరాడుతున్నారు. 173 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన స్కాట్లాండ్ను బౌల్ట్ ఆదిలోనే దెబ్బకొట్టాడు. నాలుగు ఫోర్లు కొట్టి ఊపుమీద కనిపించిన కెప్టెన్ కైల్ కోయెట్జర్ (17)ను మూడో ఓవర్లోనే పెవిలియన్ చేర్చాడు.
అయితే ఆ తర్వాత వికెట్ పడకుండా జాగ్రత్త పడిన స్కాట్లాండ్ జట్టు అద్భుతంగా ఆడింది. జార్జ్ మున్సే (22)తో కలిసి వికెట్ కీపర్ మాథ్యూ క్రాస్ (24 నాటౌట్) జట్టును ముందుకు నడిపించారు. అయితే సోధి బౌలింగ్‌లో సౌతీ అందుకున్న అద్భుతమైన క్యాచ్‌కు మున్సే పెవిలియన్ బాటపట్టాడు.
తొలి పవర్‌ప్లే చివరి ఓవర్ అయిన 6వ ఓవర్లో వరుసగా ఐదు ఫోర్లు కొట్టిన క్రాస్.. ఇంకా క్రీజులో ఉండటంతో స్కాట్లాండ్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. ఈ క్రమంలో 10 ఓవర్లు ముగిసే సరికి స్కాట్లాండ్ జట్టు 76/2తో నిలిచింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US-Iran | అమెరికన్ల హత్యకు ఇరాన్ కుట్ర.. మిడిల్ ఈస్ట్‌లో యూస్ రాయబార సిబ్బందికి హై అలర్ట్
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
అంజనాపురంలో పట్టపగలే భారీ చోరీ
Emergency Alert | యూకేలో ఎమర్జెన్సీ అలర్ట్.. మూడు రోజులకు సరుకులు ఉంచుకోవాలన్న సర్కారు..!
‘రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

