దుబాయ్: పసికూన స్కాట్లాండ్పై పటిష్ట న్యూజిల్యాండ్ ఆధిపత్యం కనబరుస్తోంది. కొన్ని సందర్భాల్లో ముందడుగు వేసినట్లు స్కాట్లాండ్ కనిపించినా.. కివీస్ పుంజుకుంది. దీంతో 15 ఓవర్లు ముగిసే సరికి స్కాట్లాండ్ జట్టు 103/4 తో నిలిచింది. ఓపెనర్లు జార్జ్ మున్సే (22), కెప్టెన్ కైల్ కోట్జర్ (17) అవుటైన తర్వాత స్కాట్లాండ్ ఆశలన్నీ వికెట్ కీపర్ మాథ్యూ క్రాస్‌పైనే పెట్టుకుంది.
కానీ అతన్ని వెటరన్ పేసర్ టిమ్ సౌతీ క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే కాలమ్ మాక్లాయిడ్ (12)ను బౌల్ట్ బౌల్డ్ చేశాడు. ప్రస్తుతం రిచీ బెర్రింగ్టన్ (20 నాటౌట్), మైకేల్ లీస్క్ (3 నాటౌట్) క్రీజులో ఉన్నారు. న్యూజిల్యాండ్ బౌలర్లలో బౌల్ట్ రెండు వికెట్లు పడగొట్టగా, సోధీ, సౌతీ చెరో వికెట్ తీశారు.