దుబాయ్: వెటరన్ బ్యాట్స్‌మెన్ మార్టిన్ గప్తిల్ (58 నాటౌట్) విజృంభిస్తున్నాడు. పసికూన స్కాట్లాండ్తో జరుగుతున్న మ్యాచ్‌లో బౌండరీలతో విరుచుపడుతున్నాడు. తోటి ఓపెనర్ డారియల్ మిచెల్ (13), కెప్టెన్ విలియమ్సన్ (0), వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ డెవాన్ కాన్వే (1) స్వల్ప వ్యవధిలోనే వెనుతిరగడంతో ఆ జట్టు ఇబ్బందుల్లో పడింది.
ఇలాంటి సమయంలో పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతను తన భుజాన వేసుకున్న గప్తిల్.. అర్ధశతకంతో చెలరేగాడు. గ్రీవ్స్ వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్లో సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో 13 ఓవర్లు ముగిసే సరికి న్యూజిల్యాండ్ జట్టు 106/3 తో నిలిచింది.