PCB : ఈమధ్య కాలంలో అంతర్జాతీయ క్రికెట్లో ఘోరంగా విఫలవుతున్న పాకిస్థాన్ జట్టును గాడీలో పెట్టేందుకు ఆ దేశ బోర్డు భారీ మార్పులు చేసింది. బంగ్లాదేశ్(Bangladesh)తో టెస్టు సిరీస్‌తో టీమ్‌కు పూర్వవైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో కొత్త కోచింగ్ సిబ్బందిని నియమించింది. జూనియర్ స్థాయిలో కోచ్‌గా విజయవంతమైన మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ (Sarfaraz Ahmed)ను హెడ్‌కోచ్‌గా తీసుకుంది. ఇక బౌలింగ్ కోచ్‌గా మాజీ పేసర్ ఉమర్ గుల్, బ్యాటింగ్ యూనిట్‌కు శిక్షకుడిగా అసద్ షఫిక్‌లకు బాధ్యతలు అప్పగించింది.
పాకిస్థాన్ జట్టు రెండు టెస్టుల కోసం మే నెలలో బంగ్లాదేశ్ వెళ్లనుంది. ఈ పర్యటనతో టీమ్‌ను బలోపేతం చేయాలనే లక్ష్యంతో కోచింగ్ యూనిట్‌ను మాజీ ఆటగాళ్లతో నింపేసింది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు. అలాఅనీ ఈసారి విదేశీయులకు అవకాశమివ్వలేదు. మూడుకు మూడు స్థానాలను తమ జట్టు మాజీ క్రికెటర్లకే పాక్ బోర్డు కట్టబెట్టింది. ఛాంపియన్స్ ట్రో2017ఫీ కట్టబెట్టిన, అనుభవజ్ఞుడైన సర్ఫరాజ్ అహ్మద్‌ను ప్రధాన కోచ్‌గా నియమించింది పీసీబీ. అతడికి సహాయకులుగా.. అఫ్గనిస్థాన్ బౌలర్లకు మెలకువలు నేర్పిన ఉమర్ గుల్ (బౌలింగ్ కోచ్), అసద్ షఫిక్(బ్యాటింగ్ కోచ్)లు నియమితులయ్యారు.
Pakistan’s Test team has a new coaching set-up pic.twitter.com/yVMKIh01SE
— ESPNcricinfo (@ESPNcricinfo) April 18, 2026
ఒకప్పుడు సీనియర్ జట్టుకు కలిసి ఆడిన ఈ ముగ్గరు ఇప్పుడు కోచ్‌లుగా ఆటగాళ్లను సానబెట్టేందుకు సిద్ధమవుతున్నారు. బంగ్లాదేశ్ సిరీస్‌తోనే వీళ్లకు తొలి పరీక్ష ఎదురవ్వనుంది. సొంతగడ్డపై బెబ్బెలిలా గర్జించే బంగ్లాను ఓడించడమే సర్ఫరాజ్, అసద్, ఉమర్ గుల్ వ్యూహాలు సిద్ధం చేయనున్నారు. ఈ సిరీస్‌తో నలుగురు కుర్రాళ్లు సుదీర్ఘ ఫార్మాట్లో అరంగేట్రం చేయబోతున్నారు.
పాకిస్థాన్ టెస్టు స్క్వాడ్ : షాన్ మసూద్(కెప్టెన్), అబ్దుల్లా ఫజల్, అమద్ బట్,అజాన్ అవైస్, బాబర్ ఆజాం, హసన్ అలీ, ఇమామ్ ఉల్ హక్, ఖుర్రం షహజాద్, మొహమ్మద్ అబ్బాస్, మొహమ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), ముహమ్మద్ ఘాజీ ఘోరీ(వికెట్ కీపర్), నొమన్ అలీ, సాజిద్ ఖాన్, సల్మాన్ అఘా, సాద్ షకీల్, షాహీన్ అఫ్రిది.
Sarfaraz Ahmed the 2017 Champions Trophy winning captain of Pakistan announced his retirement from all forms of Cricket.
Thank you Sarfaraz Ahmed #SarfarazAhmedpic.twitter.com/Gb0b36jfLw
— Cricket With Abdullah (@cric___guy) March 15, 2026
కరాచీలో జన్మించిన సర్ఫరాజ్ అండర్-19 వరల్డ్‌కప్ హీరోగా సీనియర్ జట్టులోకి వచ్చాడు. వికెట్ కీపర్, బ్యాటర్‌గా 2007లో భారత జట్టుపై వన్డేల్లో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ కెరీర్ దాదాపు ఇరవయ్యేళ్లు సాగింది. మొత్తంగా 54 టెస్టులు, 117 వన్డేలు, 61 టీ20లు ఆడాడు. వికెట్ కీపర్‌గా రాణించి 315 క్యాచ్‌లు పట్టిన అతడు.. 56 మందిని స్టంపౌట్ చేశాడు. కెప్టెన్‌గా సర్ఫరాజ్ జట్టును అద్భుతంగా నడిపాడు. అతడి సారథ్యంలోనే పాక్ 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియాను ఓడించి విజేతగా అవతరించింది.