SA vs SL | క్వింటన్ డికాక్ 18వ సెంచరీ.. జాక్వెస్ కలిస్ రికార్డు బ్రేక్
SA vs SL | ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్-2023లో భాగంగా శనివారం శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఓపెనింగ్ బ్యాటర్ క్వింటన్ డికాక్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. కేవలం 84 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 100 పరుగులు రాబట్టాడు. ఈ సెంచరీ ద్వారా సౌతాఫ్రికా అలనాటి స్టార్ ఆలరౌండర్ జాక్వెస్ కలిస్ రికార్డును బ్రేక్ చేశాడు.
న్యూఢిల్లీ: ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్-2023లో భాగంగా శనివారం శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఓపెనింగ్ బ్యాటర్ క్వింటన్ డికాక్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. కేవలం 84 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 100 పరుగులు రాబట్టాడు. ఈ సెంచరీ ద్వారా సౌతాఫ్రికా అలనాటి స్టార్ ఆలరౌండర్ జాక్వెస్ కలిస్ రికార్డును బ్రేక్ చేశాడు. కలిస్ తన కెరీర్లో 17 సెంచరీలు చేయగా, ఇప్పుడు డికాక్ 18వ సెంచరీ చేశాడు.
ఇదిలావుంటే శ్రీలంకతో మ్యాచ్లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. ఏకంగా ముగ్గురు బ్యాటర్లు సెంచరీలు చేశారు. డికాక్ (100) తోపాటుగా రస్సీ వాన్ డెర్ డస్సెన్ (108), ఎయిడెన్ మార్క్రమ్ (106) కూడా సెంచరీలతో కదం తొక్కారు. దాంతో దక్షిణాఫ్రికా జట్టు 400 పరుగుల వైపు దూసుకుపోతున్నది. కాగా, ఉదయం బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్ జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్లో బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

