ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ నిలకడగా సాగుతోంది. యువ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (15) అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన శాంసన్ కూడా నిలకడగా ఆడుతున్నాడు. మరో వైపు బట్లర్ కొంచెం నిదానంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆరో ఓవర్లో కేవలం మూడు పరుగులే వచ్చాయి.
అయితే ఆ ఓవర్ ఐదో బంతి బట్లర్ హెల్మెట్ వెనుక వైపు బలంగా తాకింది. దీంతో అతని హెల్మెట్ స్టెమ్ గార్డ్ ఊడి కిందపడిపోయింది. ఫిజియో వచ్చి అతన్ని చెక్ చేశాడు. తర్వాత ఆ ఓవర్ కొనసాగింది. దీంతో తొలి పవర్‌ప్లే ఆరు ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ జట్టు ఒక వికెట్ నష్టానికి 40 పరుగులు చేసింది.