బెంగళూరు: ఐపీఎల్ సీజన్-16లో భాగంగా ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్ల మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్నది. ఈ సీజన్లో ఇది 36వ మ్యాచ్. ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కేకేఆర్ టీమ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.