Rishabh Pant | ఇన్ఫెక్షన్ భయం.. పంత్‌ను ప్రత్యేక గదికి షిఫ్ట్చేసిన వైద్యులు
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి డెహ్రాడూన్ మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీం ఇండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డీడీసీఏ డైరెక్టర్ శ్యామ్ శర్మ పేర్కొన్నారు. అయితే, ఇన్ఫెక్షన్ సోకుతుందన్న భయంతో పంత్‌ను ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి షిఫ్ట్ చేసినట్లు తెలిపారు.
Rishabh Pant | రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి డెహ్రాడూన్ మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీం ఇండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డీడీసీఏ డైరెక్టర్ శ్యామ్ శర్మ పేర్కొన్నారు. అయితే, ఇన్ఫెక్షన్ సోకుతుందన్న భయంతో పంత్‌ను ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి షిఫ్ట్ చేసినట్లు తెలిపారు. ‘ఐసీయూలో చికిత్స పొందుతున్న పంత్‌కు ఇన్ఫెక్షన్ సోకుతుందన్న భయంతో అతన్ని ప్రత్యేక గది (Private Suite)కి మార్చాల్సిందిగా.. అతని కుటుంబ సభ్యులు, ఆసుపత్రి సిబ్బందికి చెప్పాం. ప్రస్తుతం పంత్ ఆరోగ్యం నిలకడగానే ఉంది. త్వరలో కోలుకుంటాడు’ అని శర్మ వెల్లడించారు.
కాగా, పంత్‌ను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ దామి ఆదివారం పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించి.. పంత్ వైద్యానికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు.
రిషబ్ పంత్ శుక్రవారం తెల్లవారుజామున కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఉత్తరాఖండ్‌లోని రూర్కీ వద్ద పంత్ ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీ కొట్టింది. ప్రమాదం తర్వాత కారులో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన పంత్ వెంటనే కారు అద్దాలు పగులగొట్టి బయటకు దూకేసి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఈ ప్రమాదంలో పంత్‌కు స్వల్పంగా కాలిన గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

