Rinku Singh: గత రెండు సీజన్లుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)తో పాటు దేశవాళీలో నిలకడగా రాణిస్తూ గతేడాది జాతీయ జట్టులో (టీ20లలో) అరంగేట్రం చేసిన రింకూ సింగ్ పొట్టి ఫార్మాట్‌కే పరిమితమవుతాడా..? టెస్టులలో కూడా అతడు భారత జట్టుకు ఆడాలంటే రింకూ ప్రస్తుతమున్న ఫామ్, జట్టులో ఉన్న పోటీ దృష్ట్యా ఇప్పట్లో అయితే ఈ యూపీ బ్యాటర్ నేషనల్ టీమ్‌లో చోటు దక్కించుకోవడం గగనమే. ఆ మేర ఉన్న అతికొద్ది అవకాశాలను కూడా రింకూ చేజేతులా నాశనం చేసుకుంటున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో రాణించడంతో ఇండియా ‘ఎ’లో అవకాశం దక్కించుకున్న రింకూ.. ఇంగ్లండ్ లయన్స్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో దారుణంగా విఫలమవుతున్నాడు. అతడు వరుసగా రెండు మ్యాచ్‌లలోనూ సున్నాలు చుట్టాడు.
ఇంగ్లండ్ లయన్స్‌తో జరుగుతున్న అనధికారిక టెస్టు సిరీస్‌లో భాగంగా ఇటీవలే ముగిసిన రెండో టెస్టులో బ్యాటింగ్‌కు వచ్చిన రింకూ తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో అతడికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. తాజాగా అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులోనూ రింకూ విఫలమయ్యాడు. నిన్న మొదలైన ఈ మ్యాచ్‌లో భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 192 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ ఇన్నింగ్స్‌లో రింకూ.. ఐదు బంతుల్లో పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు.
Rinku Singh nominated for the ESPN Cricinfo Debutant of the year award🦁🔥
•11 Innings
•356 Runs
•89 Average
•176.24 Strike Rate pic.twitter.com/Lw7fcM1CC2— KKR Bhakt 🇮🇳 ™ (@KKRSince2011) January 29, 2024
గతేడాది టీ20లలోకి అరంగేట్రం చేసిన ఈ యువ సంచలనం.. స్వదేశంలో ఆస్ట్రేలియాతో పాటు దక్షిణాఫ్రికాతో గతనెలలో ముగిసిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రాణించాడు. టీ20 మెరుపులతో అతడికి దక్షిణాఫ్రికా టూర్లోనే వన్డేలలో కూడా అవకాశం దక్కింది. కొద్దిరోజుల క్రితమే భారత్-అఫ్గాన్ మధ్య ముగిసిన టీ20 సిరీస్‌లో కూడా రింకూ రాణించి ఇండియా ‘ఎ’ టీమ్‌లోకి వచ్చినా ఈ సిరీస్‌లో ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ డకౌట్ అవడంతో ఇంగ్లండ్‌తో జరగాల్సి ఉన్న మిగిలిన మూడు టెస్టులకు సెలక్టర్లు రింకూ పేరును పరిశీలించే అవకాశం కోల్పోయాడు.