DC vs RCB | ఆర్సీబీ పేసర్ల జోరుతో ఢిల్లీ ఢమాల్.. 6.3 ఓవర్లకే ముగిసిన మ్యాచ్..!
DC vs RCB : ఉత్కంఠ పోరాటాలతో రంజుగా సాగుతున్న ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సంచలన విజయం సాధించింది. ఏకపక్ష మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై భారీ తేడాతో గెలుపొందింది.
DC vs RCB : ఆఖరి ఓవర్ థ్రిల్లర్లు, ఉత్కంఠ పోరాటాలతో రంజుగా సాగుతున్న ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సంచలన విజయం సాధించింది. ఏకపక్ష మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై భారీ తేడాతో గెలుపొందింది. పవర్ ప్లే లోనే భువనేశ్వర్(3-5), హేజిల్‌వుడ్(4-12) మూడేసి వికెట్లతో విరుచుకుపడగా.. ఢిల్లీని 75 కే ఆలౌట్ చేసిన ఆర్సీబీ స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. దేవ్‌దత్ పడిక్కల్(34 నాటౌట్), విరాట్ కోహ్లీ(23 నాటౌట్)లు దంచేయగా భారీ విజయంతో రన్‌రేటు మెరుగుపరచుకుంది.
డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అరుణ్ జైట్లీ స్టేడియంలో పంజా విసిరింది. భారీ స్కోర్ల మ్యాచ్‌లతో బోర్ కొట్టిన అభిమానులకు బౌలర్ల సత్తాను చూపిస్తూ భారీ విజయం మూటగట్టుకుంది. హిట్టర్లతో నిండిన ఢిల్లీ క్యాపిటల్స్‌ను 75కే ఆలౌట్ చేసి సగం విజయం సాధించిన ఆర్సీబీ మ్యాచ్‌ను 6.3 ఓవర్లలోనే ముగించింది. సొంతగడ్డపై చతికిలపడిన ఢిల్లీ ఐదో ఓటమి చవిచూసింది.
Perfect hands, perfect balance, perfect catch! 😯
🎥 T Natarajan with a brilliantly judged catch to dismiss Jacob Bethell 👏
Updates ▶️ https://t.co/HIiNNEutP0#TATAIPL | #KhelBindaas | #DCvRCB | @DelhiCapitals pic.twitter.com/1pJzmNaiQv
— IndianPremierLeague (@IPL) April 27, 2026
పడిక్కల్ ధనాధన్
ఇంప్యాక్ట్ సబ్ జాకబ్ బెథెల్(20)ను మూడో ఓవర్లోనే నటరాజన్ స్టన్నింగ్ క్యాచ్‌తో వెనక్కి పంపినా దేవ్‌దత్ పడిక్కల్(34 నాటౌట్), విరాట్ కోహ్లీ(23 నాటౌట్)దంచేశారు. జేమీసన్ ఓవర్లో పడిక్కల్ 6, 4, 6 తో స్కోర్ 60కి చేరింది. నటరాజ్ వేసిన 7వ ఓవర్లో కోహ్లీ వరసగా రెండు సిక్సర్లు బాదడంతో ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది.
భువి, హేజిల్‌వుడ్ ధాటికి
పంతొమ్మిదో సీజన్లో సంచలనం నమోదైంది. గత మ్యాచ్‌లో 264 పరుగుల స్కోర్ కొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి అనూహ్యంగా 75కే కుప్పకూలింది. పవర్ ప్లేలోనే ఆర్సీబీ పేసర్లు భువనేశ్వర్(3-5), హేజిల్‌వుడ్(4-12) వికెట్ల వేటతో ఢిల్లీ బ్యాటర్లు సున్నాలు చుట్టేశారు. బంతిని స్వింగ్ చేస్తూ ఇద్దరూ వికెట్ల పండుగ చేసుకోగా 8 పరుగులకే ఆరు వికెట్లు పడ్డాయి.
Closing the innings in style! 👊
Josh Hazlewood and Suyash Sharma rattle the stumps to bundle out the hosts for 7️⃣5️⃣
Updates ▶️ https://t.co/HIiNNEutP0#TATAIPL | #KhelBindaas | #DCvRCB | @RCBTweets pic.twitter.com/wALUv36mPY
— IndianPremierLeague (@IPL) April 27, 2026
ఇన్నింగ్స్ తొలి ఓవర్లో మొదటి బంతికే అరంగేట్రం కుర్రాడు సహిల్ పరాఖ్(0)కు భువనేశ్వర్ యార్కర్‌తో బౌల్డ్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లో హేజిల్‌వుడ్ మొదటి రెండు బంతుల్లో కేఎల్ రాహుల్(1), సమీర్ రిజ్వీ(0)లను ఔట్ చేసి హ్యాట్రిక్‌పై నిలిచాడు. ట్రిస్టన్ స్టబ్స్(5) వికెట్ కాపాడుకున్నా భువనేశ్వర్‌కు దొరికిపోయాడు. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే అక్షర్ పటేల్(0)ను భువి ఔట్ చేసి ఢిల్లీని భయపెట్టాడు. నేనేమన్నా తక్కువా అన్నట్టు ఆ తర్వాతి ఓవర్లోనే నితీశ్ రానా(1)ను హేజిల్‌వుడ్ వెనక్కి పంపాడు. అంతే.. 8 పరుగులకే ఆరో వికెట్ పడింది.

బెంగళూరు పేసర్ల విజృంభణ చూశాక ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ పేరిటున్న అత్యల్ప స్కోర్‌ను ఢిల్లీ బ్రేక్ చేస్తుందనిపించింది. కానీ, డేవిడ్ మిల్లర్(19), ఇంప్యాక్ట్ సబ్ అభిషేక్ పొరెల్(30) పట్టుదలగా ఆడారు. వీరిద్దరు వికెట్ కాచుకోవడంతో పవర్ ప్లేలో ఢిల్లీ 6 వికెట్ల నష్టానికి 13 పరుగులు చేసింది. ఓపికగా ఆడుతున్న మిల్లర్, పొరెల్ జోడీని విడదీసిన రసిక్ దార్ సలాం ఢిల్లీని ఆలౌట్ అంచున నిలిపాడు. కుల్దీప్ అండతో జట్టు స్కోర్ 70 దాటించాడు పొరెల్. కానీ, 17వ ఓవర్ మూడో బంతిని హేజిల్‌వుడ్ సంధించిన యార్కర్‌కు అతడు బౌల్డయ్యాడు. దాంతో, 75 పరుగులకే ఢిల్లీ ఇన్నింగ్స్‌కు తెరపడింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parliament: డీలిమిటేషన్, వుమెన్స్ కోటా బిల్లులు.. ఈనెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు
Calling Name Presentation: ఫోన్ స్క్రీన్‌పై ఇక పేరు కూడా డిస్ప్లే అవుతుంది.. నవంబర్ ఒకటి నుంచి తప్పనిసరి
Tuni Chairperson | తునిలో జనసైనికులకు షాక్.. చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చిన నేత!
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

