Ravindra Jadeja | మళ్లీ రంజీ ట్రోఫీలో జడేజా.. టెస్టు సన్నద్ధత అదిరేనా..!
Ravindra Jadeja: భారత క్రికెటర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) మళ్లీ దేశవాళీలో బరిలోకి దిగనున్నాడు. స్వదేశంలో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ విజయంలో భాగమైన జడ్డూ వచ్చే రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర (Sourashtra) తరఫున ఆడనున్నాడు.
Ravindra Jadeja: భారత క్రికెటర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) మళ్లీ దేశవాళీలో బరిలోకి దిగనున్నాడు. స్వదేశంలో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ విజయంలో భాగమైన జడ్డూ వచ్చే రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర (Sourashtra) తరఫున ఆడనున్నాడు. వచ్చే సీజన్ (2026-27)కు అందుబాటులో ఉంటానని చెప్పడంతో సెలెక్టర్లు అతడిని ఎంపిక చేశారు. న్యూజిలాండ్(Newzealand)తో రెండు టెస్టుల సిరీస్‌కు సన్నాహకంగా ఈ ఆల్‌రౌండర్‌కు రంజీ ట్రోఫీ ఉపయోగపడనుంది.
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27లో కీలకమైన టెస్టు సిరీస్‌కు ముందు రవీంద్ర జడేజా దేశవాళీ టోర్నీలో ఆడనున్నాడు. నవంబర్‌లో న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్‌కు సన్నద్ధతగా అతడు 92వ రంజీ ట్రోఫీ సీజన్లో బరిలోకి దిగనున్నాడు. సీనియర్ పేసర్ జయదేవ్ ఉనాద్కట్(Jaydev Unadkat) కెప్టెన్‌గ శుక్రవారం ప్రకటింటించిన సౌరాష్ట్ర స్క్వాడ్‌లో ఈ స్పిన్ ఆల్‌రౌండర్ ఉన్నాడు. 16మందితో కూడిన స్క్వాడ్‌లో జడ్డూతో పాటు యువపేసర్ చేతన్ సకారియా, నీల్ పాండ్యా, తరంగ్ గొయెల్ తదితరులు బౌలింగ్ దళంలో కీలకం కానున్నారు.
Ravindra Jadeja included in Saurashtra’s 16-member squad against Chhattisgarh for #RanjiTrophy
@sportstarweb https://t.co/cBWGAEV1Ah
— Shayan Acharya (@ShayanAcharya) October 9, 2026
లీగ్ దశలో వీటితో
అక్టోబర్ 11వ తేదీ నుంచి రంజీ ట్రోఫీ 2026-27 మొదలవ్వనుంది. ఎలైట్ గ్రూప్ బీలో ఉన్న సౌరాష్ట్ర.. లీగ్ దశలో ఆంధ్ర, అస్సాం, ఛత్తీస్‌గఢ్, హైదరాబాద్, కర్నాటక, పంజాబ్, త్రిపుర జట్లను ఢీకొట్టనుంది. ఇదివరకు ఉనాద్కట్ సారథ్యంలో రెండుసార్లు (2019-20, 2022-23) విజేతగా నిలిచిన ఈ జట్టు నిరుడు లీగ్ దశలోనే వెనుదిరిగింది. గతంలో సౌరాష్ట్ర తరఫున ఒకే మ్యాచ్‌లో 12, ఇంకోసారి 11 వికెట్లతో రాణించిన జడేజా రాకతో మెరుగైన ప్రదర్శన చేయాలనుకుంటోంది ఉనాద్కట్ బృందం. ఇక.. కివీస్‌తో టెస్టుల విషయానికొస్తే వెల్లింగ్టన్లో నవంబర్ 19న తొలి టెస్టు.. ఆపై నవంబర్ 27న క్రిస్ట్‌చర్చ్‌లో రెండో మ్యాచ్‌లో ఉండనుంది.
సౌరాష్ట్ర స్క్వాడ్: జయదేవ్ ఉనాద్కట్(కెప్టెన్), రవీంద్ర జడేజా, హర్విక్ దేశాయ్(వికెట్ కీపర్), అర్పిత వసవదా, చిరాగ్ జనీ, ప్రేరక్ మన్కడ్, జై గోహిల్, చేతన్ సకారియా, అంకుర్ పన్వర్, సమ్మర్ గజ్జర్, పార్థ్ భుట్, విశ్వరాజ్సిన్హ జడేజా, హత్వేక్ కొటక్, నీల్ పాండ్యా, అర్త్ యాదవ్, తరంగ్ గొయెల్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | సీజేపీ నిరసన కోసం అన్నింటినీ బంద్ చేయొద్దు.. కేంద్రానికి సూచించిన సుప్రీంకోర్టు
Ravindra Jadeja | మళ్లీ రంజీ ట్రోఫీలో జడేజా.. టెస్టు సన్నద్ధత అదిరేనా..!
ప్రజల వద్దకే పాలన కోసం జిల్లాలు ఏర్పాటు : గొంగిడి సునీతామహేందర్ రెడ్డి
Wife Stabs Husband’s Private Part | వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో.. భర్త ప్రైవేట్ భాగంపై కత్తితో భార్య దాడి
పోలీస్ ఉద్యోగార్థులకు బుసిరెడ్డి ఫౌండేషన్ చేయూత
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

