Ravi Shastri : వచ్చే వన్డే ప్రపంచకప్ ఆడాలనుకుంటున్న రోహిత్ శర్మ(Rohit Sharma) లార్డ్స్ శతకంతో వీడ్కోలు వార్తలకు చెక్ పెట్టాడు. ఫామ్‌లేమిపై వస్తున్న విమర్శలు.. కెరీర్లో ఆఖరి మ్యాచ్ అంటూ వైరలవుతున్న కథనాలకు తన స్టయిల్లో బదులిచ్చాడని మాజీ ఆటగాడు రవి శాస్త్రి(Ravi Shastri) అన్నాడు. తన సామర్థ్యంపై కొత్తగా పుట్టుకొచ్చిన సందేహాలను పటాపంచలు చేసిన హిట్‌మ్యాన్ తనను వేలెత్తి చూపిస్తున్న వాళ్ల నోళ్లు మూయించాడని శాస్త్రి పేర్కొన్నాడు.
భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ భవితవ్యంపై రవి శాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. స్కై స్పోర్ట్స్‌తో మాట్లాడిన శాస్త్రి లార్డ్స్ వన్డేలో శతకం రోహిత్ విమర్శలకు ధీటైన సమాధానమిచ్చాని తెలిపాడు. ‘రోహిత్ తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. కానీ, అతడు అందరి నోళ్లు మూయించాడు. ఎందుకంటే.. తీవ్రంగా వదంతులు వ్యాపిస్తున్నప్పుడు కొన్నిసార్లు చాలా చికాకుగా అనిపిస్తుంది. ఆటగాడిగా ఎన్నో సాధించిన అతడు మళ్లీ కొత్తగా నిరూపించుకోవాల్సిందేమీ లేదు.
🚨 RAVI SHASTRI SILENCES ROHIT SHARMA’S CRITICS! 🔥
Ravi Shastri said “Rohit Sharma didint need to prove himself but he has shut up everybody”. pic.twitter.com/R43r8FPwE9
— Spotlight Central (@avbvikash1810) July 20, 2026
రోహిత్‌కు ఇంకా ఆడాలనే కోరిక ఉంటే.. తన ఆటపై దృష్టి పెట్టాలి. అతడు ఆటను ఇప్పటికీ ఆస్వాదిస్తున్నాడు. ఆడాలనుకున్నంత కాలం రోహిత్‌కు అవకాశమివ్వాలనేది నా అభిప్రాయం. తాను రిటైర్మెంట్ పలకాల్సిన రోజు వస్తుంది. కానీ, అనుభవం, నాణ్యత కలిగిన రోహిత్‌ను పక్కన పెట్టాలనుకున్నప్పుడు.. అతడు సెంచరీతో చెలరేగాడు. అతడి కెరీర్లో ఇలాంటి ప్రత్యేకమైన ఇన్నింగ్స్ ఆడడం ఇదే మొదటిసారి’ అని శాస్త్రి పేర్కొన్నాడు.

ఆటగాడిగా, కెప్టెన్‌గా భారత జట్టుకు విశేష సేవలందించిన కోహ్లీ, రోహిత్ అవసరం ఇంకా ఉందని శాస్త్రి అభిప్రాయపడ్డాడు. ‘రోహిత్, విరాట్ ఇద్దరూ చిన్న స్కోర్లను భారీ స్కోర్లుగా మలవడంలో సమర్ధులు. ఒకసారి 40-50 దాటారంటే సెంచరీ కొట్టడం ఖాయం. ఛేదనలో జట్టుకు భారీ స్కోర్ ఎంత ముఖ్యమో వారికి తెలుసు. ఇద్దరిలో ఎవరో ఒకరు 130 -140 కొట్టాలనుకున్నారు.
అయితే.. రోహిత్ నుంచి శతకం వచ్చింది. అతడికి శుభ్‌మన్ గిల్, విరాట్ చక్కని సహకారం అందించారు. కానీ.. 380 అనేది భారీ లక్ష్యం. బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో టీమిండియా మరింత మెరుగుపడాలి. లార్డ్స్ వన్డేలో తొలిసారి అర్ధ శతకం బాదిన కోహ్లీలో ఆటపై ఇష్టం ఇసుమంతైనా తగ్గలేదు. మైదానంలో, డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లీ ఉంటే ఆ ఎనర్జీయే వేరు. చెప్పాలంటే విరాట్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడు లేడు’ అని శాస్త్రి వెల్లడించాడు.